ప్రభాస్, కృతి సనన్ కలిసి ప్రస్తుతం `ఆదిపురుష్` చిత్రంలో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. తెలుగు, హిందీలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు.