వాదించిన బండ్ల గణేష్..బొత్సకు బినామీని కాదు.. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కొడుకుపై కామెంట్స్

First Published Aug 28, 2021, 7:47 PM IST

నిర్మాత బండ్ల గణేష్ ఎలాంటి కామెంట్స్ చేసినా వైరల్ అవుతుంటాయి. ఇటీవల బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇండస్ట్రీలో నేపోటిజం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌

నిర్మాత బండ్ల గణేష్ ఎలాంటి కామెంట్స్ చేసినా వైరల్ అవుతుంటాయి. ఇటీవల బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇండస్ట్రీలో నేపోటిజం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బండ్ల గణేష్ నెపోటిజం గురించి తనదైన శైలిలో స్పందించారు. 

బ్యాగ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలోకి ప్రవేశం సులభం అవుతుంది కదా అని యాంకర్ ప్రశ్నించగా.. ఆయనతో బండ్ల గణేష్ వాదించారు. బ్యాగ్రౌండ్ అనేది కేవలం ఒకటి రెండు చిత్రాల వరకే. ఇక్కడ కష్టపడే వారికే అన్నం. కష్టపడేవారికే ఎదుగుదల అని బండ్ల గణేష్ పేర్కొన్నాడు. 

పూరి జగన్నాధ్, శ్రీకాంత్, నేను ఒకే ఏడాది ఇండస్ట్రీకి వచ్చాం. మేమంతా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగాం. పూరి జగన్నాధ్ ఇండస్ట్రీ ని ఏలే దర్శకుడిగా ఎదిగారు. ఆయన కొడుకు ఆకాష్ పూరి ఇంకా సక్సెస్ కాలేదు. త్వరలోనే సక్సెస్ అవుతాడు. కానీ పూరి కొడుకు అయి ఉండి కూడా సక్సెస్ అందుకోవడం ఆలస్యం అవుతోంది. 

Bandla Ganesh

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన విజయ్ దేవరకొండ ఇవాళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్. ఇక్కడ కష్టపడే వాడిదే రాజ్యం అని బండ్ల గణేష్ తేల్చి చెప్పాడు. 

బొత్స సత్యనారాయణకు బండ్ల గణేష్ బినామీ అనే రూమర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మరోసారి తాను బొత్సకు బినామీ కాదని బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చాడు. తాను బ్యాంక్స్ నుంచి లోన్స్ తెచ్చుకుంటాను కాబట్టి వాటికే తాను బినామీ అని అన్నాడు. 

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అంటే తనకు ఇష్టం ఉన్నప్పటికీ ఆయన పార్టీలో చేరకపోవడానికి కారణం ఉందని బండ్ల గణేష్ అన్నాడు. తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభిమానిని అని తెలిపాడు. 

click me!