తమిళంలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి. ఏకంగా ఆ స్టార్ హీరో జోడీగా..?

First Published | May 26, 2023, 12:08 PM IST

పాపం కృతి శెట్టి... ఉప్పెన సినిమాతో అలా ఉప్పెనలాపైకి లేచి.. ఒకేసారి పడిపోయింది. వరుసగా హ్యాట్రిక్ హిట్ సాధించిన హీరోయిన్. కొంత కాలంగా వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతుంది. ఇక తాజాగా ఆమెకు తమిళ్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. 

కన్నడ సోయగం కృతిశెట్టికి వరుస అవకాశాలు వస్తున్నాయి కాని హిట్లు మాత్రం పడటంలేదు. దాంతో ఈమధ్య ఆ అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఎటు తిరిగి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు బ్యూటీకి. ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అన్న ఇండస్ట్రీలోనే కొంత మందితో ఐరెన్ లెగ్ అనిపించుకుంటుంది బ్యూటీ. 

తాజాగా నాగచైతన్యతో కలిసి నటించి కష్టడీ సినిమాతో.. ఓ మోస్తరు హిట్టు కొట్టింది కృతి శెట్టి.  ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. వరుసగా బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలతో సూపర్ హిట్లు ఖాతాలో వేసుకుంది. ఇక ఆతరువాత తాను నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. తాంతో అవకాశలు కూడా రాలేదు బ్యూటీ కి. 


టాలీవుడ్ లో  అరంగేట్రం అదిరిపోయినప్పటికీ..ఆ తర్వాత కృతి శెట్టి పరిస్థితి మారిపోయింది. దాంతో కెరీర్‌లో మంచి కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్నది కృతిశెట్టి. ఈ నేపథ్యంలో ఆమె తమిళంలో దళపతి విజయ్‌ సరసన నటించే బంపరాఫర్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.  పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోయే భారీ సినిమాలోల

కృతి శెట్టికి తాజాగా కాస్త ఊరటనిచ్చిన సినిమా కస్టడీ. ఈసినిమాను డైరెక్ట్ చేసిన వెంకట్‌ప్రభు.. సక్సెస్ కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఈక్రమంలో విజయ్ తో సినిమా చేసే చాన్స్ కొట్టేశారట విక్రమ్ ప్రభు. ఇక ఇఈ సినిమాలో  ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో ఒకరిపేరుకు కృతిశెట్టిని తీసుకున్నారట మేకర్స్. 
 

కస్టడీ సినిమాతో కృతి శెట్టికి మంచి మార్కులు పడ్డాయి. దాంతో విజయ్ సరససన కూడా ఈ బ్యూటీ బాగుంటుదని వెంకట్ ప్రభు ఈసినిమాకు సై అన్నారట. ఇక ఈసినిమాతో్ అయినా కృతి శెట్టి జాతకం మారుంతుందో లేదో చూడాలి మరి.కృతిశెట్టి కెరీర్‌లోనే ఇదొక మంచి అవకాశమని. దాన్ని నిలబెట్టుకోవాలంటూ..  ఆమె అభిమానులు సంతోషం వ్యకం చేస్తున్నారు.

Latest Videos

click me!