డోస్‌ పెంచుతున్న కృతి శెట్టి.. బ్లాక్‌ డ్రెస్ విరహ పోజులతో టెంప్ట్ చేస్తున్న బేబమ్మ.. హాట్‌నెస్‌ చూడతరమా!

Published : Oct 02, 2022, 08:23 PM IST

`ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. తొలి చిత్రంతో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ భామ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్‌ అందాలతో రచ్చ చేస్తుంది. కుర్రాళ్లకి చూపుతిప్పుకోనివ్వడం లేదు. 

PREV
16
డోస్‌ పెంచుతున్న కృతి శెట్టి.. బ్లాక్‌ డ్రెస్ విరహ పోజులతో టెంప్ట్ చేస్తున్న బేబమ్మ.. హాట్‌నెస్‌ చూడతరమా!

కృతి శెట్టి ఓవర్‌నైట్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న అందాల సోయగం. లేలేత అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీ ఇటీవల గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. కమర్షియల్‌ హీరోయిన్‌ ఫ్లేవర్‌ కోసం తెగ ట్రై చేస్తుంది. ఇటీవల ఈ అమ్మడు వరుసగా ఫోటో షూట్లు చేస్తూ ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ నిస్తుంది. 
 

26

కృతి శెట్టి తాజాగా మరోసారి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. బ్లాక్‌ గౌన్‌లో మైండ్‌ బ్లాక్‌ చేసే పోజులతో కనువిందు చేసింది. విరహంతో కూడిన పోజులిస్తూ నెటిజన్లని టెంప్ట్ చేస్తుంది. మత్తెక్కించే కళ్లతో మైమరపింప చేస్తుంది. సామాజిక మాధ్యమాల్లో టెంపరేచర్‌ పెంచేసింది. 
 

36

ఈ సందర్భంగా కృతి శెట్టి ఆ సందేశాత్మక పోస్ట్ పెట్టింది. `మీ భయాలను ఎప్పుడూ నమ్మవద్దు. ఎందుకంటే వాటికి మీ బలాలు తెలియవు` అంటూ స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేసింది. ఆమె పెట్టిన సందేశానికి, షేర్‌ చేసిన ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కృతి పిక్స్ ని ట్రెండ్‌ చేస్తున్నారు. 
 

46

`ఉప్పెన` చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది కృతి శెట్టి. తొలి చిత్రంతో బంపర్‌ హిట్‌ని అందుకుని స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. వరుసగా ఆఫర్లు అందుకుంది. యంగ్‌ హీరోలకు బెస్ట్ ఛాయిస్‌గా నిలిచింది కృతి శెట్టి. 

56

`శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` చిత్రాల వరకు ఫర్వాలేదు. కానీ ఆ తర్వాత ఆమె చేసిన రామ్‌ పోతినేని `వారియర్‌`, నితిన్‌ `మాచర్ల నియోజకవర్గం`, సుధీర్‌బాబు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` వంటి సినిమాల్లో నటించగా, ఈ మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద పరాజయం చెందాయి. ఇవన్నీ ఈ ఏడాదే విడుదల కావడం విశేషం. 
 

66

ప్రస్తుతం ఈ బ్యూటీ నాగచైతన్యతో సినిమా చేస్తుంది. వెంకట్‌ ప్రభు దర్శకుడు. తెలుగు తమిళంలో బైలింగ్వల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. దీంతోపాటు ఓ తమిళ సినిమా చేస్తుంది కృతి శెట్టి. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. తనకు యాక్షన్‌ సినిమాలంటే ఇష్టమట, అలాంటి సినిమాల కోసం వెయిట్‌ చేస్తున్నట్టు చెప్పింది కృతి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories