గత ఏడాది వరుస పరాజయాలు ఎదురుకావడంతో జోరుమీదున్న కృతి శెట్టికి కాస్త బ్రేక్ పడింది. ఉప్పెన చిత్రంతో కుర్రాళ్ళ హృదయాల్లో సునామి సృష్టించిన కృతి శెట్టి ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. గత ఏడాది కృతి శెట్టి నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.