అందుకు కారణం ఒకటుంది. వీరిద్దరికీ అది అభిప్రాయాల మీద ఇంకొకరికి చాలా గౌరవం ఉంది అని అంటాడు. అప్పుడు వసు, రిషి ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు రిషి, వసు మనసులోని మాటలు జయచంద్ర బయట పెట్టడంతో జగతి సంతోషపడుతూ ఉంటుంది. అన్ని కోణాల్లో ఆలోచించి చెబుతున్నాను వీరిద్దరూ సమానమే అని అంటారు జయచంద్ర. తర్వాత స్పీచ్ అయిపోవడంతో అందరూ అక్కడ నుంచి వెళ్లిపోగా రిషి, వసు మాత్రమే మిగులుతారు. అప్పుడు ఇద్దరు దగ్గరగా వచ్చి హత్తుకుంటారు. అప్పుడు రిషి, వసు హత్తుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు.