ఈరోజు ఎపిసోడ్లో ప్రియ విక్రమ్ కి కాఫీ తీసుకొని వెళుతుండగా బసవయ్య దొంగచాటుగా తొంగి చూస్తూ ఉంటాడు. అప్పుడు విక్రం ఎవరికీ ఈ కాఫీ అన్నంతో మీకే అనగానే నేను అడగలేదు కదా అనడంతో ఇవ్వాలనిపించింది అని అంటుంది ప్రియ. అప్పుడు బసవయ్య నీ చెంప అనిపిస్తుంది మా అక్కకు ఈ విషయం తెలిస్తే గువ్వ గుయ్యిమనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఎలా ఉంది అత్తారిల్లు అనగా బాగానే ఉంది అనడంతో నీ ముఖం చూస్తే అలాగా అనిపించలేదు ఏదో కోల్పోయిన దానిలా ఉంటున్నావు అని అంటాడు విక్రమ్.