Krithi Shetty Hunting: కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తున్న బేబమ్మ.. చిలిపిగా కవ్వింపులు

Published : Jan 01, 2022, 09:34 PM ISTUpdated : Jan 01, 2022, 10:59 PM IST

`ఉప్పెన` భామ కృతి శెట్టి క్రేజీ స్టార్‌గా నిలుస్తుంది. ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో సెన్సేషనల్‌ హీరోయిన్‌గా మారింది కృతి. యంగ్‌ స్టర్స్ కి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న  కృతి శెట్టి ఇప్పుడు కిల్లింగ్‌ పోజులతో కుర్రాళ్లకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. 

PREV
110
Krithi Shetty Hunting: కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తున్న బేబమ్మ.. చిలిపిగా కవ్వింపులు

`ఉప్పెన` చిత్రంలో బేబమ్మగా తెలుగు ఆడియెన్స్ హృదయాలను దోచుకుంది కృతి శెట్టి(Krithi Shetty). కర్నాటకకి చెందిన ఈ క్యూట్‌ అందాల సోయగం టాలీవుడ్‌లో యంగ్ సునామీలా మారింది. నెటిజన్లకి డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. ఇన్నోసెంట్‌ లుక్స్ తో, క్యూట్‌ స్మైల్‌తో హంట్‌ చేసే ఈ బ్యూటీ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. లేటెస్ట్ గా తన గ్లామర్‌ ఫోటోలతో కుర్రాళ్లని మెసలనివ్వడం లేదు. బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్లామర్‌ లుక్స్ తో, డిఫరెంట్‌ ట్రెండీ వేర్‌లో కనువిందు చేస్తూ హార్ట్ బ్రేక్‌ చేస్తుంది Krithi Shetty. 

210

కృతి శెట్టి `ఉప్పెన` తర్వాత మరో బోల్డ్ రోల్‌ చేసింది. నానితో కలిసి `శ్యామ్‌ సింగరాయ్‌`(shyam Singha Roy) చిత్రంలో నటించింది. ఈ చిత్రం గత వారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. ఇందులో కీర్తిగా కృతి శెట్టి కనువిందు చేసింది. బోల్డ్ రోల్‌లో మెప్పించింది. 

310

`ఉప్పెన` చిత్రంలో బోల్డ్ సీన్‌లో నటించి ఆశ్చర్యానికి గురి చేసిన కృతి శెట్టి, `శ్యామ్‌ సింగరాయ్‌` చిత్రంలోనూ నానితో ఓ బోల్డ్ సీన్‌ చేసింది. లిప్‌లాక్‌లతోనూ రెచ్చిపోయింది. స్కిన్‌ షో విషయంలో హద్దులు మీరని ఈ అందాల భామ.. సన్నివేశాల్లో మాత్రం రెచ్చిపోతుందనే కామెంట్లని ఎదుర్కొంటుంది. 

410

కథ డిమాండ్‌ చేస్తే, పాత్ర డిమాండ్‌ మేరకు తాను ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించేందుకు సిద్ధమే అని తెలిపింది కృతి శెట్టి. అందులో భాగంగానే `శ్యామ్‌ సింగరాయ్‌`లో నానితో లిప్‌లాక్‌గానూ, రొమాంటిక్‌ సీన్‌ గానీ చేశానని తెలిపింది. అందుకోసం హాలీవుడ్‌ సినిమాలను చూసిందట. 

510

ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా వరుసగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతుంది కృతి శెట్టి. ఓ వైపు సినిమా ఇంటర్వూలు, మరోవైపు టీవీ స్టూడియోస్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది. తనకు సంబంధించిన అనేక విషయాలను పంచుకుంది. 

610

తాజాగా తాను నటిస్తున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` చిత్ర ఫస్ట్ లుక్‌ ఈవెంట్‌లో పాల్గొంది. ఇందులో రెడ్‌ స్లీవ్‌లెస్‌ డ్రెస్‌లో హోయలు పోయింది కృతి శెట్టి. ఓ వైపు క్యూట్‌ లుక్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. చిలిపిగా కవ్విస్తూ నెటిజన్ల హంట్‌ చేస్తుంది. ఈ అమ్మడి హింటింగ్‌ పోజులకు చిత్తైపోతున్నారు.
 

710

కెరీర్‌ప్రారంభంలోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది కృతి శెట్టి. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిన ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు అరడజను సినిమాలున్నాయంటే అతిశయోక్తి కాదు. క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. 

810

`ఉప్పెన` సినిమాలో బేబమ్మగా మెరిసిన కృతి.. `శ్యామ్‌ సింగరాయ్‌`లో కీర్తిగా కాస్త బోల్డ్ రోల్‌లో కనిపించి ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి చిత్రంలోని పాత్రకి పూర్తి భిన్నమైన రోల్‌ చేసి ఆశ్చర్యపరిచింది. సినిమా సినిమాకి పాత్రలు డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటానని తెలిపింది కృతి శెట్టి. 
 

910

ఇప్పుడు కృతిశెట్టి చేతిలో సుధీర్‌బాబు `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నాగచైతన్య `బంగార్రాజు`,  రామ్‌ పోతినేని `రాపో19`, నితిన్‌ `మాచర్ల నియోజకవర్గం` చిత్రాలున్నాయి. వీటితోపాటు మరికొన్ని సినిమాల్లోనూ ఆమె నటిస్తుంది. 

1010

ప్రస్తుతం తెలుగులో యంగ్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచిన కృతి శెట్టి లక్కీ చార్మ్ గానూ మారింది. ఆమె సినిమా చేసిందంటే ఆ సినిమా హిట్టే అనే టాక్‌ని తెచ్చుకుంటుంది. అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీతో నటించాలని స్టార్‌ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారని టాక్‌.  లేటెస్ట్ ట్రెండీ వేర్‌లో కనువిందు చేస్తున్న కృతి శెట్టి. ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories