Kajal Pregnancy Announced: ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌... కాజల్‌ ప్రెగ్నెన్సీ ప్రకటించిన భర్త గౌతమ్‌ కిచ్లు..

Published : Jan 01, 2022, 08:08 PM ISTUpdated : Jan 01, 2022, 09:37 PM IST

స్టార్‌ హీరోయిన్‌, అందాల తార కాజల్‌ అగర్వాల్‌ ప్రెగ్నెన్సీ కి సంబంధించి అనేక రూమర్స్ చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పటి వరకు ఆ విషయంపై స్పందించలేదు కాజల్‌.  తాజాగా భర్త గౌతమ్‌ కిచ్లు కన్పమ్‌ చేశారు. 

PREV
17
Kajal Pregnancy Announced: ఫ్యాన్స్ కి  గుడ్‌న్యూస్‌... కాజల్‌ ప్రెగ్నెన్సీ  ప్రకటించిన భర్త గౌతమ్‌ కిచ్లు..

కాజల్‌ అగర్వాల్‌ 2020అక్టోబర్‌లో ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌కిచ్లుని వివాహం చేసుకుంది. పెళ్లికి ముందే వీరిద్దరు ప్రేమించుకున్నారు. చాలా కాలంగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. కానీ ఆ విషయాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచింది కాజల్‌. జస్ట్ బ్యాచ్‌లరేట్‌ పార్టీ టైమ్‌లో తన ప్రేమ, పెళ్లి విషయాన్ని ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది.  అందంతో తమ హృదయాలకు కొల్లగొట్టిన కాజల్‌ ఇక ఓ వ్యక్తి వశం కాబోతుందనే వార్తతో ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్‌ అయ్యింది. కానీ చేసేదేం లేక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. 

27

ఇక ఏడాది పూర్తి చేసుకున్న కాజల్‌, గౌతమ్‌ కిచ్లు జంట.. తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా సాగుతుందనే విషయాన్ని పలు మార్లు అభిమానులకు చెప్పేప్రయత్నం చేశారు. భార్యాభర్తలు కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ ప్రేమని తెలియజేశారు. 

37

గత కొన్ని రోజులుగా కాజల్‌ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. ఆమె సినిమాలు చేయకపోవడం, తెలుగులో నటించాల్సిన `ఘోస్ట్` మూవీ నుంచి తప్పుకుందనే వార్తల నేపథ్యంలో ప్రెగ్నెంట్‌ కారణంగానే ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకుందనే వార్త ఊపందుకుంది. అయితే దీనిపై కాజల్‌ స్పందించింది. కానీ క్లారిటీ ఇవ్వలేదు. 

47

తాను గర్భం దాల్చాననే వార్తలపై కాజల్‌ స్పందిస్తూ, దానిపై ఇప్పుడు స్పందించలేదు. సరైన సమయంలో దాని గురించి మాట్లాడతా అని తెలిపింది. ఇంతక తాను ప్రెగ్నెంటా? కాదా అనే విషయాన్ని సస్పెన్స్ లో పెట్టింది. కానీ కాజల్‌ ప్రెగ్నెంట్‌ అనే విషయాన్ని అభిమానులు నమ్ముతూ వచ్చారు. తాజాగా ఆ విషయాన్ని కాజల్‌ భర్త పరోక్షంగా హింట్‌ ఇచ్చాడు. 

57

తాజాగా కొత్త ఏడాది సందర్భంగా కాజల్‌, గౌతమ్‌ కిచ్లు తమ రొమాంటిక్‌ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులకు న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు. ఈ సందర్బంగా పంచుకున్న  కాజల్‌ ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మరోవైపు గౌతమ్‌ కిచ్లు మరో పిక్‌ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. 2022 సంవత్సంలో దీని కోసం ఎదురుచూస్తున్నాం అంటూ ప్రెగ్నెంట్‌తో ఉన్న ఎమోజీని పంచుకున్నాడు గౌతమ్‌ కిచ్లు. 
 

67

దీంతో అభిమానులు కాజల్‌ ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫమ్‌ చేసుకున్నారు. గౌతమ్‌ కిచ్లు ఆల్మోస్ట్ అఫీషియల్‌గా కాజల్‌ ప్రెగ్నెన్సీని ప్రకటించారని కామెంట్లు చేయడం,ఆ ఫోటోని వైరల్‌ చేయడం విశేషం. దీంతో ఇప్పుడు సోషల్‌ మీడియాలో కాజల్‌ వైరల్‌ అవుతుంది. అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూనియర్‌ కాజల్‌ రాబోతున్నారని, కాజల్‌, గౌతమ్‌ పేరెంట్స్ కాబోతున్నారని విషెస్‌ తెలియజేస్తున్నారు.
 

77

మరోవైపు న్యూ ఇయర్‌ సందర్భంగా వెకేషన్‌కి చెక్కేస్తుంది కాజల్‌. భర్త గౌతమ్‌, పేరెంట్స్‌తో కలిసి కాజల్‌ గోవాకి వెళ్తున్నారు. ముంబయి ఎయిర్‌ పోర్ట్ లో దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories