హీరోయిన్ కృతి శెట్టి క్రేజీ ఆఫర్ పట్టేశారు. ఆమెకు భారీ పీరియాడిక్ యాక్షన్ మూవీలో అవకాశం వచ్చింది. ఈ మూవీతో ఆమె మాలీవుడు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని కృతి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
ఉప్పెన మూవీతో కృతి శెట్టి ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆమెకు ఆఫర్స్ వరస కట్టాయి. ఉప్పెన తర్వాత చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలు సైతం హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. దీంతో లక్కీ హీరోయిన్ ట్యాగ్ పట్టేసింది.
27
Krithi shetty
హ్యాట్రిక్ విజయాలు పూర్తి చేసిన కృతి శెట్టికి హ్యాట్రిక్ ప్లాప్స్ ఎదురయ్యాయి. ఆమె గత మూడు చిత్రాలు ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. దీంతో గోల్డెన్ లెగ్ ఇమేజ్ కోల్పోయింది.
37
Krithi shetty
ఇక జయాపజయాలతో సంబంధం లేకుండా కృతి శెట్టికి ఆఫర్స్ వస్తున్నాయి. నాగ చైతన్యకు జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. అలాగే హీరో సూర్యకి జంటగా వానన్ గాన్ టైటిల్ తో మరో బైలింగ్వల్ మూవీలో నటిస్తున్నారు.
47
Krithi shetty
తాజాగా ఆమె మాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా కొత్త చిత్ర విశేషాలు తెలియజేశారు.
57
Krithi shetty
మిన్నల్ మురళి ఫేమ్ తోవినో థామస్ హీరోగా అజయంతే రాన్ దామ్ మోషనమ్ టైటిల్ తో పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతుంది. జితిన్ లాల్ దర్శకుడు కాగా తోవినో థామస్ మూడు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.
67
Krithi shetty
అజయంతే రాన్ దామ్ మోషనమ్ మూవీ హీరోయిన్ గా ఎంపిక కావడంతో కృతి శెట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ చిత్ర యూనిట్ తో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు. అక్కడ కూడా తన మార్క్ చూపించాలని విషెష్ తెలియజేస్తున్నారు.
77
Krithi shetty
కన్నడ అమ్మాయి అయిన కృతి శెట్టి తెలుగులో గుర్తింపు తెచ్చుకొని తమిళ, మలయాళ భాషల్లో కూడా అడుగుపెట్టనుంది. అక్కడ కృతి ఈమేరకు రాణిస్తుందో చూడాలి. సూర్య, తోవినో థామస్ చిత్రాలపై మంచి అంచనాలున్నాయి.