17 ఏళ్లకే హీరోయిన్, ఫస్ట్ సినిమాతో 100 కోట్లు, కట్ చేస్తే కనిపించ కుండా పోయిన కృతి శెట్టి, చీరకట్టుతో మాయ చేస్తోంది

Published : Jan 14, 2026, 07:12 PM IST

చీరకట్టులో  మెస్మరైజ్ చేస్తోంది కృతీ శెట్టి. స్టార్ డమ్ కోల్పోయి.. సినిమాలు ఫెయిల్ అయ్యి.. ఇబ్బందుల్లో ఉన్న ఈ బ్యూటీ.. ఇన్ స్టాలో మాత్రం తగ్గేదే లేదంటోంది. 

PREV
15
17 ఏళ్లకే హీరోయిన్ గా ఎంట్రీ?

 చాలా చిన్న వయసులో ఇండస్ట్రీకి వచ్చింది కృతీ శెట్టి. 17 ఏళ్ల వయసులో హీరోయిన్ గా మారింది. ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్  కొట్టింది.  ఉప్పెన సినిమాతోే  ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది కృతి. 

25
మొదటి సినిమాతోనే 100 కోట్లు..

ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు.. 100 కోట్ల కలెక్షన్స్ కూడా సాధించింది కృతీ శెట్టి. ఆతరువాత వరుస సినిమాలు చేసిన బ్యూటీ.. నాలుగైదు సినిమాల తరువాత  అన్నీ ఫ్లాప్‌ సినిమాలే పడటంతో ఫేడౌట్‌ అయ్యే పరిస్థితి నెలకొంది. 

35
వరుసగా 6 సినిమాలు డిజాస్టర్..

నానితో చేసిన `శ్యామ్‌ సింగరాయ్‌` యావరేజ్‌గా ఆడింది. నాగచైతన్యతో చేసిన `బంగార్రాజు` కూడా యావరేజ్‌గా ఆడింది.వీటితోపాటు `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `కస్టడీ`, `ఏఆర్‌ఎం`, `మనమే` వంటి సినిమాల్లో నటించినా అన్నీ పరాజయం చెందాయి.

45
చీరకట్టులో మెరిసిన బ్యూటీ..

సినిమాలు లేక.. ఇబ్బంది పడుతున్న కృతీ శెట్టి.. సోషల్ మీడియాలో మాత్రంఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. వరుసగా ఫోటో షూట్లు చేస్తూ.. హడావిడి చేస్తోంది. తాజాగా చీరకట్టులో మెరుపులు మెరిపించింది ఉప్పెన బ్యూటీ. 

55
షూటింగ్స్ లో బిజీగా ఉన్నా సరే..

షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, కృతి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో తరచుగా ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది.అదేవిధంగా, ఇప్పుడు చీరలో అందంగా ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఆ ఫోటోలకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. హార్ట్‌ ఎమ్మోజీలు  వెల్లువెత్తుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories