తెలుగమ్మాయిగా ఈషా రెబ్బా మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది అంటే విశేషమే.