నాగార్జున హోస్ట్ గా సెప్టెంబర్ 6న బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. సెలబ్రిటీల నుంచి పది మంది, కామనర్స్ నుంచి ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్, జబర్దస్త్ నరేష్, దేబ్జానీ, ముఖేష్ గౌడ, కృష్ణుడు, చైత్ర రాయ్, వర్షిణి సౌందరాజన్, సుధీర్ రెడ్డి, త్రిగుణ్, అలాగే కామనర్స్ సింగర్ ఝాన్సీ, రోహిత్ నాయుడు, అమన్, చరణ్, షాలిని, సృష్టి హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి వారంలో మిడ్ వీక్‌లోనే చైత్ర రాయ్, చరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా చరణ్‌ని మళ్లీ హౌజ్‌లోకి తీసుకొచ్చారు.