Rip Krishnam Raju : ఎవరికీ తెలియని కోణం... సినిమాటోగ్రాఫర్ కావాలనుకున్న కృష్ణంరాజు హీరో ఎలా అయ్యాడు!

First Published Sep 11, 2022, 10:27 AM IST


నటుడిగానే అందరికీ పరిచయం ఉన్న కృష్ణంరాజు గొప్ప ఫోటోగ్రాఫర్ కూడాను. ఆయన జర్నీ మొదలైంది ఫోటోగ్రాఫర్ గానే కావడం విశేషం. ఫోటోగ్రాఫర్ గా ఆయన కొన్ని అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. 
 

కృష్ణంరాజు అంకుల్ మూర్తిరాజు గారు ఆయన హైదరాబాద్ రావడానికి కారణం అయ్యాడు. నీవు చాలా తెలివిగల వాడివి ఫోటోగ్రఫీ టాలెంట్ ఉంది, హైదరాబాద్ వెళదామని నన్ను తీసుకొచ్చారు. ఆయనే నాతో రాయల్ స్టూడియో పెట్టించారు. తర్వాత నాకు మహారాష్ట్రకు చెందిన చౌహాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. 
 


చౌహాన్ కెమెరా మెన్.. అతనితో కలిసి స్టూడియో నడుపుతూ ఉండేవాడిని, సినిమాల్లోకి రాకముందు నా బిజినెస్ అదే. చౌహాన్ తరచూ నా ఫోటోలు తీస్తూ ఉండేవారు. అప్పుడే కొందరు హీరోలా ఉన్నావు, సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అన్నారు. నాకు మాత్రం ఆసక్తి లేదు అనేవాడిని. 
 


కెమెరా మెన్ గా సినిమా తీయాలి మద్రాసు వెళ్ళాం. డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి కానీ సినిమా తీయడం కుదరలేదని కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఫొటోగ్రఫీపై మక్కువ కలిగినవాడిగా కృష్ణం రాజు ఖరీదైన కెమెరాలు సేకరించేవారు. ఫోటో గ్రాఫర్ గా ఆయన కొన్ని అవార్డులు అందుకున్నారు. 


సినిమాటోగ్రాఫర్ కావాలనుకున్న కృష్ణం రాజు నట ప్రస్థానం నాటకీయంగా మొదలైంది. కృష్ణం రాజు ఇండస్ట్రీకి వెళ్లాడని తెలిసిన జనాలు హీరో అయ్యాడంట అనే పుకార్లు లేపారు. ఇక్కడ నేను కనీసం నటుడు కాలేదు, బయటేమో హీరో అంటూ ప్రచారం జరుగుతుందని ఫీలైన కృష్ణంరాజు అప్పుడు నటన సీరియస్ గా తీసుకున్నారట. సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టిన మూడేళ్లకు 1966లో చిలకా గోరింకా మూవీతో నటుడిగా అవకాశం వచ్చింది. 

అయితే తొలిచిత్రం ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో చాలా నిరాశ పడ్డారు. ఫ్లాప్‌తో ఆయనకు ఏమీ సంబంధం లేదని మిత్రులు, దర్శక నిర్మాతలు సర్దిచెప్పినా ఆయన సమాధాన పడలేదు. నటనను మెరుగుపరచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు. నటనలో రాటు దేలేందుకు ప్రముఖులు రాసిన పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు సీహెచ్ నారాయణరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవరకు ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. ఇది ఆయనలోని నిబద్ధతను పరిశ్రమకు చాటింది.


తర్వాత డొండీ నిర్మాణ సారథ్యంలో.. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా అలరించారు. ఆ చిత్రంలో విలన్‌ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుకున్నారు. అప్పటికే ప్రఖ్యాత విలన్‌ ఆర్‌ నాగేశ్వరరావు చనిపోవడంతో అంతా ఆయన్ను మరో ఆర్‌ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారన్నారు.

click me!