
Soundarya: సహజ నటి, సహజమైన అందం, అత్యంత ఇన్నోసెంట్ హీరోయిన్, అద్భుతమైన నటిగా, ఒకప్పుడు తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా రాణించిన సౌందర్య మరణించి ఇరవై ఏళ్లు అయ్యింది. కానీ ఆమె ఇప్పటికీ తెలుగువారి హృదయాల్లో చిరంజీవిగానే ఉండిపోయింది.
ఆమె సినిమాల ద్వారానో, ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె గురించి చర్చ జరుగుతుంటుంది. ఆమె జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలు, ఆశ్చర్యపరిచే విషయాలు ఉన్నాయి. ఆమెకి తీరని కోరికలున్నాయి. ఎన్నో ఆశలున్నాయి. కానీ అవి తీరకుండానే వెళ్లిపోయింది.
సౌందర్య లైఫ్‌లో మరో ఆసక్తికర విషయం ఉంది. ఆమె నటిగా ఎలాంటి పాత్ర అయినా ఈజీగా చేస్తుంది. ఈజీగా పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తుంది. పాత్రని రక్తికట్టింది. పాత్రకి ప్రాణం పోస్తుంది. ఇది అది అని కాదు, ఎలాంటి పాత్రలైనా చేయగలదు. పాజిటివ్‌రోల్స్ తోపాటు నెగటివ్ రోల్స్ కూడా చేయగలదు. కానీ అలాంటి నటినే ఓ సినిమా విషయంలో భయపడిందట. తాను నటించలేను, తన వల్ల కాదు అని దర్శకుడికి చెప్పేసిందట.
మరి ఆ సినిమా ఏంటో చూస్తే, `అంతఃపురం`. కృష్ణవంశీ దర్శకత్వంలో 1998లో వచ్చిన మూవీ ఇది. ఇందులో సౌందర్యతోపాటు ప్రకాష్ రాజ్, సాయికుమార్, జగపతిబాబు నటించారు. ఇందులో సాయికుమార్‌కి జోడీగా సౌందర్య నటించింది. నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో జగపతిబాబు చేశారు.
ప్రకాష్ రాజ్ మరీ మూర్ఖత్వపు రోల్. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో వారి ముర్ఖత్వపు ఆచారాలు, రౌడీయిజం ప్రధానంగా తెరకెక్కించారు. చాలా రా అండ్ రస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు రా అండ్ రస్టిక్ చిత్రాలు వచ్చి ఆదరణ పొందుతున్నాయి. కానీ కృష్ణవంశీ 27ఏళ్ల క్రితమే అలాంటి సినిమా తీసి హిట్ కొట్టాడు.
అప్పట్లో ఈ మూవీ ఒక సంచలనం. వామ్మో సినిమా ఏంటి ఇలా ఉందని ఆశ్చర్యపోయారు చాలా మంది. ఇలాంటి సినిమా ఎలా చేశారని అంతా షాక్ అయ్యారు. విమర్శల ప్రశంసలందుకున్న ఈ సినిమా కమర్షియల్‌గానూ ఫర్వాలేదనిపించింది. కానీ ఇప్పుడు ఇలాంటి మూవీ వస్తే వేరే లెవల్‌లో ఆడేదని చెప్పొచ్చు. ఈ మూవీ ఏకంగా తొమ్మిది నంది అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే ప్రకాష్ రాజ్‌కి జాతీయ అవార్డు కూడా వరించింది.
ఇందులో సౌందర్య పాత్ర చాలా రస్టిక్‌గా ఉంటుంది. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె సాయికుమార్‌ని పెళ్లి చేసుకుంటుంది. వాళ్ల నాన్న ప్రకాష్ రాజ్ మరీ ముర్ఖుడు, ప్రత్యర్థులతో గొడవలు, ఒకరినొకరు చంపుకోవడాలు ఉంటాయి. దీన్ని సౌందర్య ఎదురిస్తుంది. అవి మానేయాలని చెబుతుంది. అయినా వినరు, దీంతో తన కొడుకుని తీసుకుని వెళ్లిపోవాలనుకుంటుంది.
కానీ వెళ్లనివ్వరు, దీంతో వారితోనే పోరాటం చేయాల్సి వస్తుంది, ఈ క్రమంలో డీ గ్లామర్ లుక్‌లో కనిపించాలి, దెబ్బలు తినాలి, కింద పడిపోవాలి, ఇలాంటి దారుణమైన సీన్లు ఇందులో సౌందర్య మీద ఉన్నాయి. చాలా సందర్భాల్లో దెబ్బలు కూడా తగిలాయట. ఆ కష్టం, ఆ బాధని చూసి సౌందర్య వామ్మో ఇది చేయడం నా వల్ల కాదని దర్శకుడు కృష్ణవంశీకి చెప్పేసిందట.
మొహమాటం ఎక్కువగా ఉండే సౌందర్య నోటి నుంచి ఇలాంటి మాట వచ్చిందంటే ఆమె ఎంతగా ఇబ్బంది పడిందో అర్థం చేసుకోవచ్చు, అది ఎంత కష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే దర్శకుడికి నా వల్ల కాదు, ఈ సినిమా చేయలేను అని చెప్పిందట. కానీ కృష్ణవంశీ, టీమ్ కలిసి కన్విన్స్ చేశారు.
ఎందుకంటే సినిమా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది, ఆమె తప్ప ఎవరూ చేయలేరని అందరికి తెలుసు. అందుకే ఒప్పించారు. తాను కూడా తప్పని పరిస్థితిలో సినిమాని పూర్తి చేసిందట. వీరి పడ్డకష్టానికి ఫలితం దక్కింది. అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఈ మూవీ సౌందర్య కెరీర్లోనే చాలా ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
read more: `కార్తికేయ` సినిమాలు `ఖలేజా`కి కాపీ? భార్య మొహం మీదే చెప్పేసిందా?.. నిజాలు బయటపెట్టిన డైరెక్టర్
also read: మేకప్ లేకుండా అనసూయ డేర్.. ఒరిజినల్ లుక్‌పై నెటిజన్లు క్రేజీ రియాక్షన్.. చివరికి ఈ పరిస్థితేంటి?