ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న అల్లు అర్జున్, ఏ సినిమానో తెలుసా...?

Published : Mar 02, 2024, 08:15 PM IST

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించి.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఒక సినిమాను.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రిజెక్ట్  చేశారట. సూపర్ హిట్ మూవీని బన్నీ ఎందుకు వదిలేసుకున్నారు. అసలు ఎలా ఆసినిమా మిస్ అయ్యింది. ఇంతకీ ఏంటా సినిమా చూద్దాం. 

PREV
17
ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న అల్లు అర్జున్, ఏ సినిమానో తెలుసా...?

టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న హీరో ఉదయ్ కిరణ్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ గా ఊపు ఊపేస్తున్నాడు అల్లు అర్జున్. అయితే వీళ్లిద్దరికి సబంధించిన ఓ  విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే ఉదయ్ కిరణ్ నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని.. బన్నీ చేయాల్సి ఉందట. కాని ఆసినిమా బన్నీ మిస్ చేసుకున్నాడు. ఇంతకీ అల్లు అర్జున్ ఆ సినిమాను ఎలా మిస్ చేసుకున్నాడు. ఏంటి సంగతి  అంటే..? 

27

టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. తేజ  డైరెక్షన్ లో వచ్చిన మొట్ట మొదటి సినిమా చిత్రం ద్వారా హీరోగా  టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఉదయ్ కిరణ్. ఫస్ట్ మూవీతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అదే క్రేజ్ తో దూసుకుపోయాడు. చిత్రం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. వెంటనే తేజతో మరోసినిమా చేశాడు ఉదయ్ కిరణ్. 
 

37

తేజ డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ చేసిన రెండో సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.  ఆ సినిమానే నువ్వునేను. టాలీవుడ్ హిస్టరీలోనే సంచలన విజయాన్ని సాధించిన ప్రేమ కథా చిత్రంగా నువ్వు నేను  రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీతో ఉదయ్ కిరణ్ ఉత్తమ నటుడి అవార్డును కూడా అందుకున్నాడు. ఆ తరువాత లవర్ బాయ్ గా ఉదయ్ కిరణ మంచి మంచి సినిమాలు చేశాడు. 

47

అయితే  ఉదయ్ కిరణ్ కెరీర్  లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా  మనసంతా నువ్వే . ఈసినిమా  సాధించిన విజయంతో ఉదయ్ కిరణ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రేమికులంతా ఈమూవీ చూసి తెలియన ఫీలింగ్ లో మునిగి తేలిపోయారు. అంత సూపర్ హిట్ అందుకున్న తరువాత ఉదయ్ కిరణ కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. వరుస ఫ్లాప్స్ రావడంతో సతమతం అయ్యారు.  కెరీర్ సరిగ్గా రూట్ లో పెట్టుకోలేకపోయాడు. చివరకు బలవన్మరణానికి పాల్పడ్డాడు ఉదయ్ కిరణ్. 
 

57

ఉదయ్ కిరణ్ ను ఇష్టపడే ప్రతీ ఒక్కరు ఇప్పటికీ బాధపెట్టే విషయం ఇది. ఇక  ఈ విషయాన్ని పక్కకు పెడితే..  ఉదయ్ కిరన్ నటించిన సూపర్ హిట్ మూవీ  నువ్వు-నేను ముందుగా  అల్లు అర్జున్ తో చేయాలి అనుకున్నారట.  అదే విషయాన్ని తేజ గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. చిత్రం సినిమా సూపర్ హిట్ సాధించిన తరువాత నువ్వు-నేను కథను రాసుకున్నాను.
 

67

అప్పుడే అల్లు అర్జున్ ని చూశాను. నా కథకు సరిగ్గా సరిపోతాడు అనుకున్నాను. నా కథలో హీరో ఎలా ఉండాలో అల్లు అర్జున్ అలా ఉన్నాడు అనిపించిందని తేజ చెప్పారు. కానీ అదే విషయాన్ని అల్లు అరవింద్ గారికి చెప్పగా.. బన్నీ అప్పుడే మల్టీ మీడియా కోర్సు నేర్చుకుంటున్నాడు అని చెప్పాడట. 

77

హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సమయం ఉందని తెలపడంతో.. దీంతో తొలి సినిమాను ఉదయ్ కిరణ్ తోనే సినిమా చేశానని తెలిపాడు తేజ. ఆ తరువాత అల్లు అర్జున్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన గంగోత్రి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్నాడు. ఇక అంత మంది సూపర్ హిట్ స్టోరీని మిస్ చేసుకున్నాడు బన్నీ. అయితే వీరి కాంబోలో మంచి హిట్ మూవీ వస్తే బాగుండు అనుకుంటున్నారు ఐకాన్ స్టార్. 
 

Read more Photos on
click me!

Recommended Stories