కృష్ణంరాజుకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్.. నిరూపిస్తే కోట్ల ఆస్తి ఇస్తా అని ఛాలెంజ్ చేసిన రెబల్ స్టార్ 

ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు తన సంపద, కుటుంబ అలవాట్ల గురించి తెలిపారు. తాను డబ్బు విషయంలో మాత్రమేకాదు, మనసు విషయంలో కూడా చాలా రిచ్ అని అన్నారు.

Krishnam Raju

టాలీవుడ్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు చెరగని ముద్ర వేశారు. కృష్ణంరాజు పేరు చెప్పగానే టాలీవుడ్ లో విందు భోజనాలు గుర్తుకు వస్తాయి. సినిమా షూటింగ్ ఉన్నప్పుడు చిత్ర యూనిట్ కి కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి అన్ని రకాల వంటకాలతో విందు ఉంటుంది. కృష్ణంరాజు తర్వాత ప్రభాస్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. 

ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు తన సంపద, కుటుంబ అలవాట్ల గురించి తెలిపారు. తాను డబ్బు విషయంలో మాత్రమేకాదు, మనసు విషయంలో కూడా చాలా రిచ్ అని అన్నారు. తాము ధనవంతులం అయినప్పటికీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు దాచుకోలేదని తెలిపారు. వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు చేసేవాళ్ళం. మా ఫ్యామిలీ ముందు నుంచి ఇలాగే బతుకుతోంది. అవసరం అయినప్పుడు ఎక్కడి నుంచి అయినా డబ్బు తెచ్చి ఖర్చు చేసేవాళ్ళం అని కృష్ణంరాజు అన్నారు. 


తాను షూటింగ్ కి వెళ్లి మేకప్ వేసుకుంటే కృష్ణంరాజుని అనే సంగతి మరచిపోతాను అని అన్నారు. షూటింగ్ లో ఇతర విషయాలు పట్టించుకోను. షూటింగ్ గ్యాప్ లో పేకాట ఆడడం లాంటివి చేయను. నాకు 40 ఏళ్ళ నుంచి ఉన్న ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్.. డ్రింకింగ్ అని కృష్ణంరాజు అన్నారు. అది కూడా లిమిట్ గా మాత్రమే. 40 ఏళ్ళ కెరీర్ లో ఒక్కసారి కూడా నేను అతిగా తాగి దుర్భాషలాడటం, మత్తులో మాట జారడం, వేరే వాళ్ళని తిట్టడం లాంటివి చేయలేదు. 

అలా నేను ప్రవర్తించినట్లు ఎవరైనా నిరూపిస్తే వాళ్ళకి కోట్ల ఆస్తి ఇస్తా అని కృష్ణంరాజు ఛాలెంజ్ చేశారు. మా ఫ్యామిలిలో చాలా మందికి పేకాట ఇంట్రెస్ట్ ఉండేది. కానీ దానిపై తనకి ఏమాత్రం ఆసక్తి లేదని కృష్ణంరాజు అన్నారు. 

మా పూర్వికులు చాలా ఆస్తి కోల్పోయారు అని కృష్ణంరాజు అన్నారు. తాను ఇండస్ట్రీలోకి వచ్చి బాగా సెటిల్ అయ్యాక గ్రానైట్ ఇండస్ట్రీ పెట్టానని దాంట్లో కూడా లాభాలు రాలేదని కృష్ణంరాజు తెలిపారు. 

Latest Videos

click me!