'పెద్ది' ఫస్ట్ షాట్ టీజర్ రివ్యూ: రాంచరణ్ ఊర మాస్ బ్యాటింగ్, 1000 కోట్లతో పాన్ ఇండియా రీసౌండ్ గ్యారెంటీ

గేమ్ ఛేంజర్ చిత్రంతో రాంచరణ్ పాన్ ఇండియా టార్గెట్ మిస్ అయింది. కానీ ఈసారి గురితప్పేలా లేదు. పెద్ది మూవీ రీసౌండ్ పాన్ ఇండియా మొత్తం వినిపించేలా ఉంది. ఎందుకంటే టీజర్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా అంచనాలు పెంచేస్తోంది.

Ram Charan Peddi Movie

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని సమస్యల వల్ల టీజర్ రిలీజ్ చేయలేదు. కానీ శ్రీరామనవమికి మాత్రం మిస్ కాకుండా ఫ్యాన్స్ ని ఎక్కువగా వెయిట్ చేయించకుండా ఫస్ట్ షాట్ పేరుతో టీజర్ రిలీజ్ చేశారు. రంగస్థలం తర్వాత రాంచరణ్ రగ్గడ్ లుక్ లో, విలేజ్ బాక్ డ్రాప్ లో నటిస్తున్న చిత్రం ఇదే. దీనితో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. 

Ram Charan

గేమ్ ఛేంజర్ చిత్రంతో రాంచరణ్ పాన్ ఇండియా టార్గెట్ మిస్ అయింది. కానీ ఈసారి గురితప్పేలా లేదు. పెద్ది మూవీ రీసౌండ్ పాన్ ఇండియా మొత్తం వినిపించేలా ఉంది. ఎందుకంటే టీజర్ మొత్తం గూస్ బంప్స్ తెప్పించేలా అంచనాలు పెంచేస్తోంది. రాంచరణ్ ఉత్తరాంధ్ర యాసలో అద్భుతంగా డైలాగులు చెబుతున్నాడు. రాంచరణ్ వాయిస్ ఓవర్ తోనే టీజర్ ఉంది. 


Ram Charan

'ఒకటే పని చేసేనాకి.. ఒకేనాక బతికేనాకి ఇంతపెద్ద బతుకెందుకు.. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల.. పుడతామా ఏంటి మళ్ళీ' అంటూ చరణ్ డైలాగులు చెబుతున్నాడు. చరణ్ కి ఎలివేషన్ ఇస్తున్న ప్రతి షాట్ టీజర్ లో హైలైట్ గా ఉంది. ఇక టీజర్ చివర్లో చరణ్ క్రికెట్ ఆడుతూ సిక్సర్ కొట్టే షాట్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. రాంచరణ్ మాస్ గెటప్, బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంది. ఇక ఏఆర్ రెహమాన్ అందించిన బిజియం అయితే టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళిపోయింది. 

Ram Charan

టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాంచరణ్ ఊర మాస్ బ్యాటింగ్ మొదలైంది అని పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం 1000 కోట్లు సాధించడం పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 27 న రిలీజ్ చేస్తున్నట్లు టీజర్ తో అనౌన్స్ చేశారు.  

పెద్ది టీజర్ ఇక్కడ చూడండి. 

Latest Videos

click me!