ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తూ `వార్ 2` మూవీలో నటిస్తున్నారు. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తున్నారు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ `వార్`కి ఇది సీక్వెల్. అందులో టైగర్ ష్రాఫ్ నటించగా, ఇందులో ఎన్టీఆర్‌ని తీసుకున్నారు. తారక్‌కిది తొలి బాలీవుడ్ మూవీ. ఇప్పటికే `ఆర్‌ఆర్‌ఆర్` మూవీతో నార్త్ మార్కెట్‌కి దగ్గరయ్యాడు ఎన్టీఆర్. ఇప్పుడు `వార్ 2`తో బాలీవుడ్ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. పాన్ ఇండియా ఇమేజ్‌ని మరింత పెంచుకుంటున్నాడు.
ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతుంది. `బ్రహ్మాస్త్ర` ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్‌ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఫిల్మ్ ఇది. ఇందులో ఎన్టీఆర్ నటిస్తున్నారంటే భారీ అంచనాలు నెలకొన్నాయి. హృతిక్ రోషన్ పాత్రకి ధీటుగా తారక్ పాత్ర ఉంటుందని, అంతే శక్తివంతంగా ఉంటుందని తెలుస్తుంది. భారీ మల్టీస్టారర్ మూవీగా దీన్ని చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇంకా షూటింగ్ ఫైనల్ కానీ ఈ మూవీలో ఓ డాన్స్ నెంబర్ ఉంటుందట. అది ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య ఉండబోతుందట. ఇద్దరూ మంచి డాన్సర్లు. ఇద్దరి మధ్య అదిరిపోయే సాంగ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇందులో వారి డాన్స్ హైలైట్‌గా ఉండేలా చూస్తున్నారు. `ఆర్‌ఆర్‌ఆర్`లో `నాటు నాటు` పాట అంతర్జాతీయంగానూ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఏకంగా `ఆస్కార్ అవార్డు సొంతం చేసుకుంది. మ్యూజిక్, లిరిక్‌తోపాటు ఎన్టీఆర్, చరణ్ చేసిన డాన్సు ప్రపంచాన్ని ఊపేసింది. అందరి అటెన్షన్ గ్రాస్ప్ చేసింది. అలా ఇప్పుడు `వార్ 2`లో కూడా ఎన్టీఆర్, హృతిక్ మధ్య చేయాలని టీమ్ భావిస్తుందట.
అయితే ఇది ప్రాథమిక ఆలోచన మాత్రమే. వాస్తవంగా ఎంత వరకు సాధ్యమవుతుంది, టీమ్ ఏం చేస్తారనేది చూడాలి. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్‌కి సంబంధించిన ఓ సరికొత్త అప్‌డేట్ వినిపిస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారని సమాచారం. అయితే ఆమె ఎవరికి జోడీగా ఉంటుందనేది సస్పెన్స్. హృతిక్ సరసన నటిస్తుందా? లేక ఎన్టీఆర్‌కి జోడీగా చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఆమెతోపాటు కియారా అద్వానీ పేరు కూడా ఆ మధ్య తెరపైకి వచ్చింది. వీరిలో ఎవరు పైనల్ అవుతారో చూడాలి.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా చేస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 5న రావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతుందని, దసరాకి రాబోతుందని తెలుస్తుంది.