నిజమే కానీ ఎవరు మంచో ఎవరు చెడో అర్థం చేసుకోలేకపోతున్నారు అంటుంది రేవతి. కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు ఈశ్వర్. మరోవైపు నందిని పెళ్లికి పేమెంట్స్ ఇవ్వవలసిన వాళ్ళందరినీ ఇంటికి రమ్మంటుంది కృష్ణ. ఆన్లైన్లో పే చేసే వాడిని కదా ఇదంతా ఎందుకు అంటాడు మురారి. డబ్బులు ఇవ్వవలసింది మీ పెద్దమ్మ కదా ఆ వంకతో అయినా మీతో మాట్లాడతారేమో అందుకే ఈ ప్లాన్ వేసాను అంటుంది కృష్ణ. కృష్ణ ఫోన్ చేసిన వాళ్ళందరూ ఇంటికి వస్తారు. ఎంతయిందో ఏంటో అని భవాని, మురారితో మాట్లాడుతుందేమో అనుకుంటుంది ముకుంద. కానీ అందుకు విరుద్ధంగా డబ్బు తీసుకొచ్చి ముకుంద చేతిలో పెట్టి లెక్కలు సెటిల్ చేయమంటుంది భవాని.