మరోవైపు షూటింగ్లో మధు ఇచ్చిన స్క్రిప్ట్ తో పాటు తన ఓన్ డైలాగ్స్ కూడా యాడ్ చేసి చెప్తుంది కృష్ణ. ప్రేమికురాలి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి తన మనసులో మాట కూడా బయట పెట్టేసి రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేస్తుంది. మురారి కూడా ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయిపోతాడు. మధు కట్ చెప్పి నేను ఇచ్చిన స్క్రిప్ట్ కన్నా నువ్వు చెప్పిన డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి, చించేసావు అంటాడు.