రొమాంటిక్‌ సీన్లలో హీరోల నిజస్వరూపం బయటపెట్టిన తమన్నా.. చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కామెంట్

Published : Dec 30, 2022, 05:50 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌, బాలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉంది. మరోవైపు ఐటెమ్ సాంగ్‌ల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె స్టార్‌ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్‌ సీన్ల గురించి ఓపెన్‌ అయ్యింది.  

PREV
16
రొమాంటిక్‌ సీన్లలో హీరోల నిజస్వరూపం బయటపెట్టిన తమన్నా.. చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ కామెంట్

సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్‌ సీన్లు బాగా పండుతుంటాయి. అవి అభిమానులకే కాదు, సాధారణ ఆడియెన్స్ పండగ చేసుకునేలా ఉంటాయి. వాటికే యూత్‌తోపాటు మాస్‌ ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. రొమాంటిక్‌, ఇంటెన్స్ సీన్ల కోసం సినిమాని చూసే వాళ్లు ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే చూడ్డానికే బాగానే ఉన్నా, మరి షూటింగ్‌లో ఆయా సీన్లలో నటించేటప్పుడు హీరోహీరోయిన్లు ఎలా ఫీలవుతుంటారు, వాటిని ఎంజాయ్‌ చేస్తుంటారా? లేక ఇబ్బంది పడుతుంటారా? అనేది పెద్ద ప్రశ్నగా ఉంటుంది.

26

చాలా వరకు ఈ సీన్లలో హీరోయిన్ల కంటే హీరోలే ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తారని భావిస్తుంటాం. మరి ఇది నిజమేనా అనేది డౌట్‌. తాజాగా దీనిపై మిల్కీ బ్యూటీ తమన్నా ఓపెన్‌ అయ్యింది. రొమాంటిక్‌ సీన్లు చేసేటప్పుడు హీరోలు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని ఆమె బయటపెట్టారు. స్టార్‌ల అసలు ఫీలింగ్‌ని ఓపెన్‌గా చెప్పేసింది తమన్నా. 
 

36

ఆమె ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటిస్తూ, రొమాంటిక్‌ సీన్లలో నటించేటప్పుడు హీరోలు బాగా ఎంజాయ్‌ చేస్తారని అంతా అనుకుంటారు? కానీ అది నిజం కాదని చెప్పి షాకిచ్చింది తమన్నా. హీరోయిన్‌తో రొమాన్స్ చేయాలంటే హీరోలు చాలా ఇబ్బంది పడతారని పేర్కొంది. సాధారణంగా చాలా వరకు హీరోలు ఇంటెన్స్, రొమాంటిక్ సీన్లు చేసేందుకు ఇష్టపడరని తెలిపారు. 

46
Tamannaah

షూటింగ్‌ సమయంలో హీరోయిన్లు ఏం అనుకుంటారో అని చాలా టెన్షన్‌ పడుతుంటారని, మోహమాటం ఉన్న హీరోలు, స్టార్‌ హీరోలు సైతం ఆ సీన్లు చేసేటప్పుడు కనీసం మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటారని తెలిపింది. సినిమా షూటింగ్‌ మొత్తంలో హీరోలు ఇబ్బంది పడేది సన్నిహిత సీన్లలోనే అని, అందుకే వాటిలో నటించేందుకు చాలా మంది హీరోలు ఆసక్తి చూపరని వెల్లడించింది తమన్నా. 

56

ఇటీవల `గుర్తుందా శీతాకాలం`తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది తమన్నా. ప్రస్తుతం చిరంజీవితో `భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది. దీంతోపాటు హిందీలో మంచి జోరుమీదుంది తమన్నా. అక్కడ ఇటీవల `బబ్లీ బౌన్సర్‌`, `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ` చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 
 

66
Tamannaah

ఇప్పుడు అక్కడ తమన్నా `బోల్‌ చుడియన్‌`, మలయాళంలో `బాంద్రా` సినిమాలో నటిస్తుంది. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న చిత్రమిది. దిలీప్‌ తో కలిసి నటిస్తుంది. మరోవైపు తెలుగులోనూ ఒకటి రెండు సినిమాలకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories