దివంగత నటుడు కోట శ్రీనివాసరావు చాలా సంచలనాలకు కారణం అయ్యారు. ఆయన కామెట్స్ ఇండస్ట్రీలో మంటలు రేపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కోటా పెద్ద తాగుబోతంటూ జరిగిన ప్రచారంపై ఆయన ఏమని క్లారిటీ ఇచ్చాడంటే?
టాలీవుడ్ లో అద్భుమైన నటులలో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమ గర్వించదగ్గ నటుడు కోట. ఆయన మరణించినా.. నటించిన సినిమాల్లో అద్భుతమైన పాత్రల ద్వారా ఎప్పటికి జనాలకు గుర్తుండిపోతారు. ఒకటి కాదు రెండు కాదు.. వందల కొద్ది వేరయేషన్లు చూపిస్తూ.. వెరైటీ పాత్రలు చేసిన కోటా.. కొన్ని వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారారు. తన కెరీర్ లో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్న ఆయన.. నెగెటీవ్ ప్రచారం వల్ల ఇబ్బంది పడ్డారు.
25
టాలీవుడ్ కు సరికొత్త స్టైల్ నేర్పించిన కోట..
కోట శ్రీనివాసరావు ఓ బ్రాండ్. తెలుగు సినిమాకు కొత్త విలనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి. ఒక రకంగా చెప్పచెప్పాలంటే నవరసాలతో ప్రయోగం చేసిన అరుదైన యాక్టర్స్ లో ఆయన కూడా ఒకరు. టాలీవుడ్ లో క్యారెక్టర్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా, కమెడియన్ గా.. కామెడీ విలన్ గా.. కొన్ని వందల వేరియేషన్స్ ను తన నటనలో చూపించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. తెలుగు సినిమా నటనకు సరికొత్త స్టయిల్‌ను.. సరికొత్త మ్యానరిజమ్స్ ను నేర్పించిన కోట ఎన్నో అద్భుతమైన పాత్రలు చేశారు. అమితాబచ్చన్ తోనే ఔరా అనిపించాడు కోట శ్రీనివాసరావు.
35
రోజుకు 20 గంటలు షూటింగ్..
కెరీర్ బిగినింగ్ లో కోటా చాలా కష్టపడ్డాడు. రోజుకి 20 గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఫ్యామిలీకి దూరంగా.. నటనే ప్రాణంగా బ్రతికిన కోటా.. మంచి ఫామ్ లో ఉన్న టైమ్ లో.. నిద్రాహారాలు మాని సినిమాల కోసం పనిచేసేవారు. అలా చేసిన రోజుల్లోనే కొన్ని విమర్శలు, అపవాదులు ఎదుర్కో వలసి వచ్చింది. ఈ విషయాలను గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కోటా శ్రీనివాసరావు స్వయంగా వెల్లడించారు. అసలు ఆయన ఏం చెప్పాడంటే..?
నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రోజుకి 20 గంటలు పనిచేశాను. పొద్దున 7 గంటలకు మేకప్ వేసుకుంటే.. నైట్ 2 గంటలకు తీసేవాడిని. గదిలోకి వెళ్లి పడుకుంటే పైన ఫ్యాను.. కింద నేను ఎవరు ఉండేవారు కాదు. 42 ఏళ్ల వయసులో.. ఆ టైమ్ కు పడుకుంటే ఏం నిద్రపడుతుంది. మళ్లీ ఉదయం షూటింగ్ కు వెళ్లాటంటే ఇప్పుడు పడుకోవాలి. అందుకే కాస్త రెండు పెగ్గులు వేస్తే వెంటనే నిద్ర పట్టేది. సరిగ్గా రెండు గంటలు నిద్రపోగానే ఉదయం 5 గంటలకు బాయ్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటూ నిద్రలేపుతాడు. అప్పటికి తాగింది ఎక్కడికి వెళ్తుంది.. అక్కడక్కడే తిరిగేది లోపల. నేను గుడ్ మార్నింగ్ చెప్పగానే కంపుకొట్టేది. దాంతో కోటా రాత్రంతా తాగుతాడు రా అని పెద్ద ప్రచారం మొదలు పెట్టారు.
55
అసలు విషయం ఏంటంటే?
అసలు బయట ప్రచారం జరిగినట్టు నేను అంత తాగితే.. ఇంత కాలం బ్రతికి ఉంటానా..? 70 ఏళ్ళ వరకూ రాగలుగుతానా.. ఏదో ఏజ్ వల్ల వచ్చిన మోకాళ్ల నొప్పులు తప్పటించి. నాకు పెద్దగా ఇబ్బందులు కూడా లేవు. అవి కూడా ఆ బాబు మోహన్ ను సినిమాల్లో తన్నీ తన్నీ వచ్చిన నొప్పులే కానీ.. సహజంగా నాకు ఏ ఇబ్బందులు లేవు అని కోట శ్రీనివాసరావు గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.