30 ఏళ్లు ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో కోట శ్రీనివాసరావు భార్య.. ఏం జరిగిందో తెలుసా? కోట ఫ్యామిలీ డిటెయిల్స్

Published : Aug 18, 2025, 10:35 PM IST

కోట శ్రీనివాసరావు భార్య ఈ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె జీవితంలోని విషాదాన్ని కోట ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

PREV
15
నెల రోజుల్లో కోట ఫ్యామిలీలో రెండు విషాదాలు

కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణీ సోమవారం ఉదయం కన్నుమూశారు. నెల రోజుల క్రితమే కోట శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. నెల రోజుల గ్యాప్‌లోనే వారి కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకోవడం అత్యంత బాధాకరం. కోట శ్రీనివాసరావు గత ఇంటర్వ్యూలో తన భార్యకి ఉన్న సమస్యని బయటపెట్టారు. ఆమె సైకియాట్రిక్‌ పేషెంట్‌ అని తెలిపారు. ముప్పై ఏళ్లపాటు తాను చిన్నపిల్లలా కాపాడుకున్నట్టు తెలిపారు కోట. 

DID YOU KNOW ?
పద్మశ్రీ పురస్కారం
కోట శ్రీనివాసరావులోని విలక్షణ నటనని, ఆయన భారతీయ సినిమాకి చేసిన సేవలకుగానూ 2015లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది.
25
కోట శ్రీనివాసరావుకి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు

కోట శ్రీనివాసరావుకి రుక్మిణీతో 1968లో మ్యారేజ్‌ అయ్యింది. వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు. కొడుకు ప్రసాద్‌ సినిమాల్లో నటించారు. 2010లో రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయన `సిద్ధం`, `గాయం 2` వంటి చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలో అనూహ్యంగా రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కొడుకులు. పెద్ద కుమారుడు కోట శ్రీనివాసరావు. తన తండ్రి పేరునే పెద్దకొడుక్కి పెట్టాడు ప్రసాద్‌. చిన్న కొడుకు శ్రీహర్ష. ఇద్దరు బిటెక్‌ చేశారు. ఇప్పుడు ప్రైవేట్‌ జాబ్‌ చేస్తున్నారు. వాళ్లకి సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, తీసుకొచ్చే ఉద్దేశ్యం లేదని తెలిపారు కోట.

35
కుటుంబ బాధ్యతలు తీసుకున్న కోడలు

కొడుకు మరణంతో మనవళ్ల బాధ్యతని కోడలు చూసుకుందని, తాను చెప్పడంతో జాబ్‌ మానేసి పిల్లల్ని బాగా తీర్చిదిద్దిందని , ఇప్పుడు వాళ్లు ప్రయోజకులు అయ్యారని తెలిపారు కోట. తను వెల్‌ ఎడ్యూకేటెడ్‌ అని, కానీ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చి జాబ్‌ వదిలేసుకుందని, తమని, పిల్లల్ని బాగా చూసుకుంటుందని తెలిపారు కోట.

45
చిన్న కూతురుకి యాక్సిడెంట్‌

ఇక చిన్న కూతురు టీనేజ్‌లోనే రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆమె కాలు కోల్పోయింది. అలాంటి పరిస్థితుల్లో తాను బ్యాంక్‌లో గుమస్తాగా పనిచేసే సార్‌ పెద్దమనసు చేసుకుని తనకు వియ్యంకుడు అయ్యాడని తెలిపారు కోట. ఆమెకి ఒక కూతురు ఉందని, బాగా చదువుతుందని తెలిపారు కోట.

55
30ఏళ్లు ఎవరినీ గుర్తుపట్టలేని స్థితిలో కోట భార్య

ఇక తన భార్య గురించి ఓ షాకింగ్‌ విషయం బయటపెట్టారు కోట. `1973లో భార్య రుక్మిణీ డెలివరీ సమయంలో మా అత్తగారు చనిపోయింది. ఆ విషయం తెలిసి నా భార్య షాక్‌కి గురయ్యింది. మానసికంగా డిస్టర్బ్ అయ్యింది. సైకియాట్రిక్‌ పేషెంట్‌గా మారిపోయింది. ఎవరినీ గుర్తుపట్టలేకపోయింది. చివరికి నన్ను కూడా. ఇలా ముప్పై ఏళ్లపాటు ఆమెని కంటికి రెప్పలా కాపాడుకున్నాను. ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియదు. చెప్పాల్సిన అవసరం లేదని ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇప్పుడు తాను బాగానే ఉంది. తన కుటుంబంలో చాలా విషాదం ఉంది. కానీ ఆ విషయాలు చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు అని తెలిపారు కోట శ్రీనివాసరావు. గతంలో సుమన్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు కోట. ఈ విషయం అందరిని కలిచి వేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories