వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించిన మూవీ `కొరియన్ కనకరాజు`. సత్య కామెడీ హైలైట్‌గా సాగిన ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కింది. కామెడీ, హర్రర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఈ నెల 7న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది.