Koratala Siva: కొరటాల శివ లిస్టులో నలుగురు స్టార్ హీరోలు.. ఆచార్య నుంచి బాక్సాఫీస్ మోతే..

Published : Apr 23, 2022, 11:58 AM ISTUpdated : Apr 23, 2022, 11:59 AM IST

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

PREV
16
Koratala Siva: కొరటాల శివ లిస్టులో నలుగురు స్టార్ హీరోలు.. ఆచార్య నుంచి బాక్సాఫీస్ మోతే..
Koratala Siva

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 29న ఆచార్య గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. దర్శకుడు కొరటాల శివ ఇంటర్వ్యూలు ఇస్తూ ఆచార్య విశేషాలు వివరిస్తున్నారు. 

26
Koratala Siva

ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలకమైన కామియో రోల్ పోషిస్తుండడం మెగా ఫ్యాన్స్  పండగ చేసుకునే అంశం. ఇప్పటికే టీజర్ ట్రైలర్స్ లో తండ్రి కొడుకులు ఇద్దరూ అదరగొడుతున్నారు. ఏప్రిల్ 29న సిల్వర్ స్క్రీన్ పై ఇద్దరినీ చూస్తూ ఫ్యాన్స్ కేరింతలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 

36
Koratala Siva

ఇదిలా ఉండగా కొరటాల శివ తదుపరి చిత్రాలపై ఆసక్తి పెరుగుతోంది. ఆచార్య తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ సినిమా చేయబోతున్నారు. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ మూవీ బంపర్ హిట్ గా నిలిచింది. దీనితో ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. 

46
Koratala Siva

ఆ తర్వాత కొరటాల శివ చేయబోయే మూడు చిత్రాలు కూడా ఖరారయ్యాయి. ఈ విషయాన్ని కొరటాల శివ తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ లతో ప్రాజెక్ట్స్ కమిటై ఉన్నా. అయితే వీరిలో ఏ హీరోతో మూవీ ముందుగా ప్రారంభం అవుతుందనేది ఇప్పుడే చెప్పలేను. ఆ టైం కి ఎవరి డేట్స్ ఖాళీగా ఉంటే వారితో మూవీ ఉంటుంది అని కొరటాల అన్నారు. 

56
Koratala Siva

సో ఆచార్య తర్వాత కొరటాల శివ చేయబోయే నాలుగు చిత్రాలు ఖరారైనట్లే. నాలుగు స్టార్ హీరోల సినిమాలే. వరుసగా కొరటాల శివ బాక్సాఫీస్ పైకి భారీ వెపన్స్ నే వదులుతున్నాడు. 

66
Koratala Siva

ప్రస్తుతం అందరి కళ్ళు ఆచార్యపైనే ఉన్నాయి. చిరంజీవి, రాంచరణ్ ఇద్దరూ ఈ చిత్రంలో కామ్రేడ్ సోదరులుగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్. పూజా హెగ్డే రాంచరణ్ కి జంటగా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories