కత్తి మహేష్ తన స్థాయిని మించి ప్రవర్తించాడు, పవన్ ని తిట్టాడు.. ఇప్పుడు ఏమైంది, కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు

Published : Sep 27, 2022, 10:06 AM IST

ప్రముఖ రచయిత కోన వెంకట్ టాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాలకు పని చేశారు. దర్శకుడిగా కూడా రాణించారు. ముఖ్యంగా కోన వెంకట్, శ్రీను వైట్ల లది డెడ్లీ కాంబినేషన్.

PREV
16
కత్తి మహేష్ తన స్థాయిని మించి ప్రవర్తించాడు, పవన్ ని తిట్టాడు.. ఇప్పుడు ఏమైంది, కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ రచయిత కోన వెంకట్ టాలీవుడ్ లో అనేక హిట్ చిత్రాలకు పని చేశారు. దర్శకుడిగా కూడా రాణించారు. ముఖ్యంగా కోన వెంకట్, శ్రీను వైట్ల లది డెడ్లీ కాంబినేషన్. కానీ విభేదాల కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఇద్దరూ విడిపోయారు. 

 

26

ప్రస్తుతం కోన వెంకట్.. మంచు విష్ణు నటిస్తున్న జిన్నా అనే చిత్రానికి రచయితగా పనిచేస్తున్నారు. కోన వెంకట్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ..  బాలు సినిమా సమయంలో పవన్ తో నాకు పరిచయం ఏర్పడింది. నాగబాబు నాకు క్లోజ్ కావడంతో పవన్ ని కలవడం జరిగింది. 

 

36

కొంతమందిని తక్కువ సార్లు కలిస్తే చాలు.. ఎంతో గొప్ప రిలేషన్, సాన్నిహిత్యం ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ తో కూడా నా పరిచయం అలాంటిదే. పంజా చిత్రానికి నేను చేయాలని పవన్ కోరుకున్నారు. కానీ డైరెక్టర్ కథ చెప్పలేదు. మరొకరు ఆ చిత్రానికి పనిచేయడంతో నేను తప్పుకున్నాను అని కోన వెంకట్ అన్నారు. 

46
pawan kalyan

పవన్ కళ్యాణ్ గారికి విప్లవ భావజాలం ఎక్కువ. రాజకీయాలపై ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. సినిమాలు కాకుండా తాను ఇంకేమైనా చేయాలనీ ఎప్పుడూ అంటుండేవారు. రాజకీయాల విషయానికి వస్తే జగన్ నిజం.. చంద్రబాబు అబద్దం.. పవన్ కళ్యాణ్ అమాయకుడు అని గతంలోనే చెప్పినట్లు కోన వెంకట్ అన్నారు. 

56

కత్తి మహేష్ వివాదం జరుగుతున్న సమయంలో ఇండస్ట్రీ నుంచి బయటకి వచ్చి పవన్ తరుపున మాట్లాడిన వ్యక్తి తానేనని కోన వెంకట్ అన్నారు. మరణించిన వారి గురించి తప్పుగా మాట్లాడకూడదు.. కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి. కత్తి మహేష్ తన స్థాయిని మించి ఇష్టం వచ్చినట్లు పవన్ ని తిట్టాడు. దారుణంగా కామెంట్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఏమైంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

66

కత్తి మహేష్ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకి ముందు కత్తి మహేష్ పవన్ కి వ్యతిరేకంగా మీడియా హౌస్ లలో హల్ చల్ చేయడం చూశాం. 

Read more Photos on
click me!

Recommended Stories