Kollywood Report 2026: 2026 సంవత్సరం మొదలై ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఫస్టాఫ్‌లో కోలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది? ఏ సినిమాలు హిట్టయ్యాయి, ఏవి ఫ్లాపయ్యాయో ఇందులో తెలుసుకుందాం.
2026 సంవత్సరం గడిచి ఆరు నెలలు పూర్తయ్యాయి. ఈ ఆరు నెలల్లో తమిళ సినిమా ఎన్నో హిట్లు, ఫ్లాపులు చూసింది. విశేషం ఏంటంటే, భారీ అంచనాలతో వచ్చిన చాలా సినిమాలు బోల్తా కొట్టాయి. కానీ, చిన్న బడ్జెట్ చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. 2026 ప్రథమార్థంలో రిలీజైన సినిమాల్లో ఏది హిట్? ఏది ఫట్ అనేది చూస్తే.
27
జనవరి రిపోర్ట్
జనవరిలో పొంగల్ బరిలో శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా రిలీజైంది. ఇది మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుని రూ.85 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీనికి పోటీగా వచ్చిన కార్తి 'వా వాత్తియారే' డిజాస్టర్‌గా నిలిచింది. కానీ, అదే రేసులో వచ్చిన జీవా 'తలైవర్ తంబి తలైమైయిల్' బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ తర్వాత అజిత్ 'మంకథా' రీ-రిలీజై మంచి ఆదరణ పొందింది. 'హాట్ స్పాట్ 2' కూడా జనవరి చివర్లో విడుదలై సక్సెస్ సాధించింది.
37
ఫిబ్రవరి రిపోర్ట్
ఫిబ్రవరి నెలలో చిన్న బడ్జెట్ సినిమాలే రిలీజయ్యాయి. మొదటి వారంలో రజనీకాంత్ కూతురు సౌందర్య నిర్మించిన 'విత్ లవ్' వచ్చింది. అభిషన్ జీవింత్ హీరోగా నటించిన ఈ సినిమా రూ.39 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్టయింది. తర్వాత వచ్చిన 'పూకి', 'మై లార్డ్' ఫ్లాపయ్యాయి. నెల చివర్లో వచ్చిన రాధిక 'తాయ్ కిళవి' చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి రూ.82 కోట్లు కొల్లగొట్టింది.
మార్చి నెలలో తమిళనాడులో ఒక్క పెద్ద బడ్జెట్ సినిమా కూడా రిలీజ్ కాలేదు. అయినా, ఆ నెలలో వచ్చిన కెన్ కరుణాస్ 'యూత్' సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.72 కోట్లు వసూలు చేసి దుమ్మురేపింది. ఆ తర్వాత జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన 'హ్యాపీరాజ్' సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా, కేవలం రూ.7 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
57
ఏప్రిల్‌లో బాక్సాఫీసు రిజల్ట్
ఏప్రిల్ నెలలో తమిళనాడులో ఎన్నికలు జరిగినా, కొన్ని పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. ముఖ్యంగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ నటించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఏప్రిల్ 10న విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ నెల చివర్లో వచ్చిన ధనుష్ 'కర' సినిమా కూడా వచ్చినంత వేగంగానే వెనక్కి వెళ్లిపోయింది. అప్పుడు ప్రజలంతా రాజకీయాలపై దృష్టి పెట్టడమే దీనికి కారణం.
67
మే నెల రిపోర్ట్
మే నెలలో తమిళ సినిమాకి ప్రాణం పోశారు సూర్య, అర్జున్. ఆ నెలలో రిలీజైన సూర్య 'కరుప్పు', అర్జున్ 'బ్లాస్ట్' సినిమాలు రెండూ బ్లాక్‌బస్టర్ హిట్టయ్యాయి. ఈ చిత్రాలు వాళ్లిద్దరికీ అదిరిపోయే కంబ్యాక్‌గా నిలిచాయి. ఇందులో 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద రూ.310 కోట్లు కొల్లగొట్టి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది. అలాగే అర్జున్ 'బ్లాస్ట్' సర్ప్రైజ్ హిట్టయి రూ.75 కోట్లు వసూలు చేసింది.
77
జూన్ బాక్సాఫీసు రిజల్ట్
జూన్ ఆరంభంలో పాండిరాజ్ దర్శకత్వంలో 'పరిమళా అండ్ కో' సినిమా విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.14 కోట్లు వసూలు చేసి హిట్ లిస్ట్‌లో చేరింది. ఆ తర్వాత వచ్చిన 'హబీబీ', 'డబుల్ ఆక్యుపెన్సీ' చిత్రాలకు మంచి రివ్యూలు వచ్చినా కలెక్షన్లు రాలేదు. జూన్ చివర్లో వచ్చిన విజయ్ ఆంటోనీ 'నూరు సామి', సమంత ‘ఎంగళ్ తంగం’(మా ఇంటి బంగారం) , అర్జున్ దాస్ 'ఖాన్ సిటీ' సినిమాలు మంచి టాక్‌తో థియేటర్లలో విజయవంతంగా నడుస్తున్నాయి. సమంత మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ అయ్యింది. తమిళంలోనూ మంచి వసూళ్లు రావడం విశేషం. మొత్తంగా తమిళ సినిమాని ఈ హాఫ్ ఇయర్‌లో సూర్య, అర్జున్, రాధికా, కెన్ కరుణాస్ వంటి వారు దుమ్ములేపారని చెప్పొచ్చు.