అమ్మాయి ప్రేమ కోసం అమెరికా వెళ్లిన నాగ్.. అమలతో ఆయన ప్రేమ కహాని వింటే ఫిదా అవుతారు!

First Published Jun 7, 2021, 2:08 PM IST

టాలీవుడ్ మన్మధుడు అంటే టక్కున గుర్తు వచ్చే పేరు కింగ్ నాగార్జున. స్టార్ హీరోగా విభిన్న పాత్రలు పోషించిన నాగార్జున... టెలివిజన్ ప్రజెంటర్ గా, వ్యాఖ్యాతగా, బిజినెస్ మాన్ గా సూపర్ సక్సెస్. 
 

లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా పరిశ్రమకు పరిచయమైన నాగార్జున మొదటి చిత్రం విక్రమ్.
undefined
1986లో విడుదలైన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. అయినా లుక్ పరంగా నాగార్జునకు మంచి మార్కులే పడ్డాయి.
undefined
90లలోనే బాలీవుడ్ లో చిత్రాలు చేసిన నాగార్జున, శివ మూవీతో ఓ ట్రెండ్ సెట్ చేశాడు. వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన శివ ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు 90కి పైగా చిత్రాల్లో నాగార్జున నటించారు.
undefined
అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలుగొందిన నాగ్.. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మీని నాగార్జున 1984లో వివాహం చేసుకున్నారు. అయితే ఆరేళ్ళ వివాహ బంధం తరువాత 1990లో విడిపోయారు. వీరికి నాగ చైతన్య సంతానంగా పుట్టాడు.
undefined
తనతో నాలుగు చిత్రాలు చేసిన ఆంగ్లో ఇండియన్ హీరోయిన్ అమలతో ఆయన ప్రేమలో పడ్డారు. లక్ష్మితో విడాకుల కారణం కూడా అమలతో ప్రేమ వ్యవహారమే అని అప్పట్లో వార్తలు రావడం జరిగిం
undefined
మోడల్ గా కెరీర్ ప్రారంభించిన అమల 1986లో ఓ తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. 1992లో నాగార్జునను వివాహం చేసుకున్నాక ఆమె నటించడం మానేశారు.
undefined
ఇక షూటింగ్ సెట్స్ లో నాగార్జున, అమల సన్నిహితంగా ఉండేవారట. ఓ మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న అమలను గమనించి డైరెక్టర్ కి చెప్పి మార్చించాడట నాగార్జున.
undefined
అమలను ప్రేమిస్తున్నాని తెలుసుకున్న నాగార్జున ఆమె కోసం అమెరికా వెళ్ళాడట. అక్కడ ఓ మూవీ షూటింగ్ లో ఉన్న అమలతో తన ప్రేమ విషయం చెప్పాడట. అమలకు కూడా నాగార్జున అంటే ఇష్టం కాగా, వెంటనే ఒప్పుకున్నారట.
undefined
చెన్నైలో నాగార్జున, అమల వివాహం కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా 1994లో అఖిల్ జన్మించాడు.
undefined
click me!