Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది

Published : Jul 31, 2026, 09:27 AM IST

కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో కిరణ్.. రాంచరణ్ పెద్ది మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో జరిగిన మిస్టేక్ బయటపెట్టారు.

PREV
15
Kiran Abbavaram

టాలీవుడ్ యువ హీరోలలో ఒక్కో మెట్టు ఎదుగుతున్న నటుడు కిరణ్ అబ్బవరం. యూత్ ఫుల్ సినిమాలు, లవ్ స్టోరీలు, వైవిధ్యమైన కథలతో తనకంటూ కిరణ్ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ మధ్యన 'క' మూవీతో సూపర్ హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం తాజాగా చెన్నై లవ్ స్టోరీతో హిట్ అందుకున్నారు. రవి నంబూరి ఈ చిత్రానికి దర్శకుడు.

25
పెద్ది మూవీపై కామెంట్స్

కిరణ్ అబ్బవరంకి జోడీగా ఈ మూవీలో శ్రీ గౌరీప్రియ నటించింది. ఎస్ కె ఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా చెన్నై లవ్ స్టోరీ చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఓ ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం రాంచరణ్ పెద్ది మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ది సినిమాలో పాటలు వచ్చిన సందర్భం బాగాలేదు.. అది ఒక మిస్టేక్ అని చాలా మంది చెప్పారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో కిరణ్ కి ప్రశ్న ఎదురైంది.

35
రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది

కిరణ్ బదులిస్తూ.. నేను ఒక నటుడిగా పెద్ది చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యాను. సినిమా చూస్తున్నంత సేపు నాకు చరణ్ అన్న కష్టమే అకనిపించింది. చరణ్ అన్న ఇంత కష్టపడ్డాడు ఏంటి అని అనిపించింది. ఎక్కడన్నా సినిమా కాస్త డ్రాప్ అవుతున్నట్లు అనిపించినా.. ఇది చరణ్ అన్న కోసం ఆడాలి అని కోరుకున్నా. చరణ్ అన్న పడ్డ కష్టం నేను పడగలనా అని అనుకున్నా. సినిమాని నేను ఎంజాయ్ చేశాను.

45
పెద్దిలో జరిగిన తప్పు ఇదే

బయటకొచ్చి మా ఫ్రెండ్స్ తో కూడా అన్నాను.. ఇది చరణ్ అన్న కోసం ఆడాలి అని. నా ఒపీనియన్ ప్రకారం ఆ మూవీలో జరిగిన మిస్టేక్ ఒక్కటే. ఎమోషన్ కన్నా కమర్షియల్ అంశాలని కాస్త హైలైట్ చేయడానికి ట్రై చేశారు. ఎమోషన్ ని ఎమోషన్ లాగే చూపించి ఉంటే ఇంకా బావుండేది అని కిరణ్ అబ్బవరం తెలిపారు.

55
మెగాస్టార్ విషెస్

అయినప్పటికీ పెద్ది మూవీ చాలా బాగా ఆడింది అని, కలెక్షన్స్ పెద్ద నంబర్స్ నమోదయ్యాయి కదా అని కిరణ్ తెలిపారు. చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కిరణ్ ఆల్రెడీ గుర్తింపు పొందిన నటుడు అయ్యాడు. ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, చెన్నై లవ్ స్టోరీ బాగా ఆడాలి అని విష్ చేసిన సంగతి తెలిసిందే.

Read more Photos on
click me!

Recommended Stories