‘సామజవరగమన’, ‘ఊరుపేరు భైరవకోన’ వంటి బ్లాక్ బస్టర్‌ల తరువాత హాస్య మూవీస్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 7గా సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌కి ‘K-ర్యాంప్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ ‘K-ర్యాంప్’ సినిమాకు కొత్త డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం జరిగిన ఈ సినిమాకు పూజా కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు.
నిర్మాత అనిల్ సుంకర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్స్ విజయ్ కనకమేడల, రామ్ అబ్బరాజు, యదు వంశీ, రైటర్ ప్రసన్న స్క్రిప్ట్ అందజేశారు. యోగి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి, సీనియర్ నరేష్ పాల్గొన్నారు.