సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లో నిమగ్నం అవ్వాలని అనుకుంటున్న విజయ్ చివరి ప్రాజెక్ట్ ఇదే అంటున్నారు. అధికారిక ప్రకటన రాకున్నప్పటికీ హెచ్. వినోత్-విజయ్ ప్రాజెక్ట్ లో సమంత హీరోయిన్ గా ఎంపికైందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో కత్తి, తేరి, మెర్సల్ చిత్రాల్లో సమంత-విజయ్ జతకట్టారు. ఈ పుకార్లు నిజమైతే నాలుగోసారి కలిసి నటించినట్లు అవుతుంది.