నాగార్జునని నిలబెట్టిన మహేష్‌, వెంకటేష్‌.. నెగిటివ్ టాక్ తో `నా సామిరంగ` బ్రేక్ ఈవెన్ ఎలా సాధ్యమైందంటే?

First Published | Jan 20, 2024, 2:00 PM IST

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భోగి పండుగ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా ఆడేస్తాయి అనే నమ్మకంతో నాగార్జున సరిగ్గా సంక్రాంతికి తన చిత్రాన్ని వదిలాడు.

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భోగి పండుగ రోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా ఆడేస్తాయి అనే నమ్మకంతో నాగార్జున సరిగ్గా సంక్రాంతికి తన చిత్రాన్ని వదిలాడు. అప్పటి వరకు నా సామిరంగ చిత్రానికి చేసిన ప్రమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. 

సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి చిత్రాలు రిలీజ్ అవుతున్నప్పటికీ నాగార్జున వెనక్కి తగ్గలేదు. తన సినిమాలో పర్ఫెక్ట్ గా పండగ మెటీరియల్ ఉందని నా సామిరంగ టీం మొత్తం నమ్మింది. చివరికి నాగార్జున నమ్మకమే గెలిచింది. 


తొలి షో నుంచే నా సామిరంగ చిత్రానికి నెగిటివ్ టాక్ మొదలయింది. అయినప్పటికీ వారం రోజుల లోపే నా సామిరంగ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ట్రేడ్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ఇంత నెగిటివ్ టాక్ లో కూడా బ్రేక్ ఈవెన్ ఎలా సాధ్యమైంది అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. నా సామిరంగ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ 18 కోట్ల వరకు జరిగింది. ఈ 18 కోట్లని నా సామిరంగ చిత్రం కేవలం 6 రోజుల్లోనే సాధించేసింది. 

ఇకపై రానున్న వసూళ్లతో బయ్యర్లు లాభాలు అందుకుంటారు. దీనితో నా సామిరంగ సంక్రాంతి హిట్ ఖాతాలో పడిపోయింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ విజయం వెనుక నాగార్జున మాస్టర్ ప్లానింగ్ తో పాటు చాలా అంశాలు కలిసొచ్చాయి. నాగార్జున ముందు నుంచి నా సామిరంగ చిత్రాన్ని పండగ లాంటి చిత్రం అంటూ ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. టీజర్ ట్రైలర్ బాగా వర్కౌట్ అయ్యాయి. 

అదే సమయంలో హీరోయిన్ ఆషిక రంగనాథ్ యువతని అట్రాక్ట్ చేసింది. కంప్లీట్ గా బి అండ్ సి సెంటర్స్ ని టార్గెట్ చేస్తూ నాగార్జున ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశారు. కంటెంట్ కూడా అలాంటిదే. పల్లెటూరి నేపథ్యంలో ఎంతో కలర్ఫుల్ గా తెరకెక్కించారు. అయితే సెకండ్ హాఫ్ పై నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. కానీ ఆ నెగిటివ్ రిపోర్ట్స్ ఈ చిత్రానికి ఇబ్బంది కాలేదు. 

పండక్కి ప్రతి థియేటర్ కళకళ లాడుతుంది. భోగి పండగ రోజు గుంటూరు కారం కానీ, హను మాన్ కానీ చూడాలనుకున్న వారికి 3 వ ఆప్షన్ గా నా సామిరంగ చిత్రం నిలిచింది. ఆ రెండు చిత్రాలకు టికెట్స్ దొరకని వాళ్లంతా నా సామిరంగ కోసం ఎగబడ్డారు. సైంధవ్ ఎలాగూ ఫ్యామిలీ ఆడియన్స్ కి వర్కౌట్ అయ్యే చిత్రం కాదు అని తేలిపోయింది. పైగా పండగ ఎలిమెంట్స్ కూడా లేకపోవడంతో ఆడియన్స్ ఆ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. గుంటూరు కారం, హను మాన్ కాకుంటే నా సామిరంగ చిత్రానికే ఆడియన్స్ ఓటు పడింది. 

దీనితోపాటు `గుంటూరు కారం` నెగటివ్‌ టాక్‌, `సైంధవ్‌` డిజాస్టర్‌ టాక్‌ ఈ మూవీకి ప్లస్‌ అయ్యాయి. ఓ రకంగా మహేష్‌, వెంకీ లు ఈ మూవీని పరోక్షంగా నిలబెట్టారని చెప్పొచ్చు. ఆ మూవీస్‌ బాగుంటే ఇది కొట్టుకుపోయే ఫిల్మ్ అయ్యేది. దీనితో పండగ మూడు రోజుల్లోనే దాదాపు 60 శాతం ఈ చిత్రం రికవరీ సాధించింది. పైగా ఈ చిత్రంలో నాగార్జున ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఆ విధంగా నా సామిరంగ చిత్రం ఒక ప్లానింగ్, ఒక పద్దతితో సంక్రాంతి హిట్ గా నిలిచింది. 

Latest Videos

click me!