తెలుగు చిత్ర పరిశ్రమలో రాముడిపై వచ్చిన తొలిచిత్రం ‘పాదుకా పట్టాభిషేకం’. నటుడు యడవల్లి సూర్యనారాయణ రాముడిగా నటించారు. బాదామి సర్వోత్తం డైరెక్షన్ లో 1932లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ తర్వాత 1944లో ‘శ్రీ సీతారామ జననం‘ చిత్రంతో రాముడు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. Akkineni Nageswara Rao రాముడిగా అలరించారు.
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, దివంగత నందమూరి తారకరామరావు (Sr NTR) రాముడి పాత్రలో నటించిన చిత్రం ‘సంపూర్ణ రామాయణం’ Sampoorna Ramayanam. 1959లో విడుదలైంది.
అలాగే ఎన్టీఆర్ దర్శకత్వం వచ్చిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ Shri Rama Pattabhishekham కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. రాముడి పట్టాభిషేకాన్ని చక్కగా చూపించారు. 1978లో ఈ చిత్రం విడుదలైంది.
ఇక 1971లో దర్శక దిగ్గజం బాపు తెరకెక్కించిన ‘సంపూర్ణ రామాయణం’ కూడా బాగా ఆకట్టుకుంది. రాముడిగా శోభన్ బాబు (Shobhan Babu) అలరించారు. రాఘవుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ తరం ప్రేక్షకులకు బాగా తెసిన చిత్రం ‘శ్రీ రామదాసు’. ఈ చిత్రంలోనూ రామభక్తిని చూపించారు. రాఘురాముడి దర్శనం కూడా కల్పించారు. రాముడిగా సుమన్ అలరించారు.
నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) రాముడిగా వచ్చిన ’శ్రీ రామరాజ్యం’ కూడా అలరించింది. రాముడిని చక్కగా చూపించిన చిత్రాల్లో ఇదొకటి. 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘బాల రామాయణం’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో తారక్ బాల రాముడిగా అలరించారు.
Lava Kusa చిత్రం కూడా రామయాణాన్ని వివరించింది. ఎన్టీఆర్ రాముడిగా కనిపించారు. ఈ చిత్రం 1963లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.