మదురైకి చెందిన నివేతా పేతురాజ్.. 2016లో `ఓరు నాల్ కూథు` అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఏడాది `మెంటల్ మదిలో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాగానే ఆడింది. ఇందులో ఆమె యాక్టింగ్‌కి, ఎక్స్ ప్రెషన్స్ కి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్లనే దక్కించుకుంది. `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అల వైకుంఠపురములో`, `రెడ్`, `పాగల్`, `బ్లడీ మ్యారీ`, `విరాటపర్వం`, `దాస్ కా ధమ్కీ` వంటి తెలుగు సినిమాల్లో మెరిసింది. అయితే నివేతాకి డీసెంట్ హిట్లు పడ్డాయి, కానీ హీరోయిన్ గా బ్రేక్ ఇచ్చే సక్సెస్ రాలేదు. దీంతో తెలుగుకి దూరమయ్యింది. ఇప్పుడు ఏకంగా మ్యారేజ్‌కి రెడీ అయి లైఫ్‌లో సెటిల్ కాబోతుంది. పెళ్లి తర్వాత నటిస్తుందా? సినిమాలకు గుడ్ బై చెబుతుందా అనేది చూడాలి. ఇదిలా ఉంటే నివేతాతో తెలుగు హీరో విశ్వక్ సేన్ డేటింగ్ చేశారనే రూమర్లు వచ్చిన విషయం తెలిసిందే. `దాస్ కా ధమ్కీ` తర్వాత బ్రేకప్ అయినట్టుగా వార్తలు రావడం గమనార్హం.