‘జోగుళ’, ’గజ్జెపూజ’ వంటి ధారావాహికల ద్వారా కన్నడిగుల మనసులు గెలుచుకున్న జ్యోతి పూర్వజ్ ‘కిల్లర్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. జ్యోతి రాయ్ అయిన ఆమె దర్శకుడు సుకు పూర్వజ్ తో సహజీవనం ప్రారంభించిన తర్వాత తన పేరుని జ్యోతి పూర్వజ్ గా మార్చుకున్నారు. ఆమె తెలుగులో గుప్పెడంత మనసు టివి సీరియల్ లో జగతి పాత్రలో నటించారు.