సినిమా పరిశ్రమ.. వరుసగా ప్రేమలు, పెళ్లిళ్లలో కళకళలాడుతుంది. ఈ ఏడాది నయనతార-విఘ్నేష్, రణ్‌బీర్ కపూర్-అలియా, ప్రణిత సుభాష్, హన్సిక మోత్వానీ, ఆది పినిశెట్టి-నిక్కీ గల్రానీ మ్యారేజ్‌లు చేసుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని మ్యారేజ్‌లు జరగబోతున్నాయి. లేటెస్ట్ గా నరేష్-పవిత్ర వంటి సీనియర్ జోడీ ఒక్కటి కాబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు బాలీవుడ్‌లో క్రేజీ ప్రేమ జంటగా నిలుస్తున్న కియారా అద్వానీ(Kiara Advani), సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) సైతం ఒక్కటి కాబోతున్నారు.