Kiara-Sidharth Breakup: సిద్ధార్థ్ మల్హోత్రకు షాక్ ఇచ్చిన కియారా అద్వాని, బ్రేకప్ చెప్పేసిందట

Published : Apr 23, 2022, 02:32 PM ISTUpdated : Apr 23, 2022, 02:43 PM IST

ఈ మధ్య బాలీవుడ్ లో స్టార్స్ మధ్య ప్రేమ పెళ్లిళ్ళు , బ్రేకప్ స్టోరీస్ ఎక్కువై పోయాయి. రీసెంట్ గా ఆలియాభట్, రణ్ బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటి అవ్వగా.. మరో ప్రేమ జంట బ్రేకప్ తో దూరమైనట్టు తెలుస్తోంది. 

PREV
16
Kiara-Sidharth Breakup: సిద్ధార్థ్ మల్హోత్రకు షాక్ ఇచ్చిన కియారా అద్వాని, బ్రేకప్ చెప్పేసిందట

బాలీవుడ్‌లో మరో జంట బ్రేకప్‌ చెప్పేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే లైగర్‌ బ్యూటీ అనన్య ప్రియుడు ఇషాన్‌ ఖట్టర్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీఫుల్‌ కపుల్‌ తమ రిలేషన్‌కి ఎండ్‌ కార్డ్‌ వేసేశారు. బాలీవుడ్‌ మోస్ట్‌ క్యూటెస్ట్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న కియారా అద్వాని - సిద్దార్థ్ మల్హ్రోత్రా  బ్రేకప్ చెప్పుకున్నట్టు సమాచారం. 

26

ప్రస్తుతం బీ టౌన్ లో వీరి బ్రేకప్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. యంగ్ స్టాస్ అంతా ప్రేమించి పెళ్లి చేసుకుంటుంటే.. మంచి జంటగా పేరు తెచ్చుకన్న వాళ్ళు బ్రేకప్ చెప్పుకోవడం ఏంటీ అంటూ.. బాలీవుడ్ లో అందరూ షాక్ అవుతున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ విషయం తెలిసి..నమ్మలేకపోతున్నారు. 
 

36

గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపించాయి. కానీ సడెన్‌గా ఏం జరిగిందో తెలియదు.. వీరు తమ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. 

46

దీనికి తోడు  ఈ బ్రేకప్ చెప్పింది కూడా కియారా అద్వానినే అని.. ఆమెనే సిద్థార్ధ్ ని వదిలేసుకుందంటూ.. వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈ విషయంలే కియారా అద్వాని సన్నిహితులు, స్నేహితులే క్లారిటీ ఇవ్వడంతో బాలీవుడ్ అభిమానులు షాక్ లో ఉన్నారు.  
 

56

షేర్షా మూవీతో ఫస్ట్ టైమ్ కలిసి నటించిన  కియారా- సిద్దార్థ్‌లు ఈ సినిమా టైమ్ లోనే నే ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి పార్టీలు, వెకేషన్స్‌ అంటూ తెగ చక్కర్లు కొట్టారు. అప్పుడపుడు కెమెరాల కంట పడుతున్నా.. విషయం పై స్పందించకుండా తమ పని తాము చేసుకుంటూ పోయారు. 
 

66

ఇక రీసెంట్ గా ఆలియా-రణ్‌బీర్‌ల తర్వాత  బాలీవుడ్ లో పెళ్లి చేసుకునే కపుల్‌ వీళ్లేనంటూ బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందరికి తిప్పుకోలేని షాక్‌ ఇస్తూ కియారా అద్వాని సిద్దార్థ్‌ కు బ్రేకప్ చెప్పినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి దీని గురించి వీరు ఏం స్పందిస్తారో చూడాలి మరి.

Read more Photos on
click me!

Recommended Stories