బంగారం, వెండితో కియారా అద్వాని కోసం స్పెషల్ లెహంగా..? తయారీకి అన్ని రోజులు పట్టిందా..?

Published : Feb 25, 2023, 08:16 AM IST

రీసెంట్ గా హీరో సిద్థార్ధ్ మల్హోత్రాను పెళ్ళాడింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని. కియారా డ్రస్సింగ్ స్టైల్ అదరహో అనిపించింది. ఈక్రమంలోనే.. సంగీత్ కోసం ఈ బ్యూటీ వేసుకున్న లెహంగాపై నెటిజన్లు కన్ను పడింది. ఇంతకీ ఆ డ్రస్ స్పెషల్ ఏంటో తెలుసా..? 

PREV
17
బంగారం, వెండితో కియారా అద్వాని కోసం స్పెషల్ లెహంగా..? తయారీకి అన్ని రోజులు పట్టిందా..?
Kiara Advani'

మామూలుగానే సెలబ్రిటీలు వాడే వస్తువులు.. వేసుకునే డ్రస్ లు.. ఆకరికి కాళ్ళకు తొడుక్కునే చెప్పులు కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి ఎందుకుంటే.. వాటి కాస్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది కనుక. ఇక స్పెషల్ అకేషన్స్ లో అయితే చెప్పుకోనక్కర్లేదు... జీవితంలో గుర్తుండిపోయే రోజుల్లో.. డబ్బులు లేకక్క చేయకుండా లక్షల్లో.. కోట్లల్లో డబ్బు ఖర్చు పెట్టి కొనేస్తుంటారు.. స్టార్స్.. ఈక్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని వేసుకున్న లెహంగా నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. 

27
Kiara Advani'

పెళ్ళంటేనే కోట్లు ఖర్చు పెడుతుంటారు స్టార్ సెలబ్రిటీలు.. ముఖ్యంగా.. కాస్ట్ర్యూమ్స్.. జ్యూవ్వెల్లరీకి ఎంత అవుతుందో లెక్కే ఉండదు. డ్రస్స్ లను ఫైమస్ డిజైనర్ల చేత తయారు చేయిస్తుంటారు. ఈనేపథ్యంలోనే కియారా కూడా తన వెడ్డింగ్ డ్రస్ లను బాలీవుడ్ స్టార్లకు ఆస్థాన దర్జీ అయిన మనీష్ మల్హోత్రా  వీటిని డిజైన్ చేశాడట. 
 

37
Kiara Advani'

సంగీత్ వేడుకల్లో సిద్ధార్థ్ తో దిగిన ఫోటోను కియారా అద్వానీ షేర్ చేసుకుంటూ ఆ రాత్రి గురించి ఏం చెప్పాలి.. సమ్ థింగ్ రియల్లీ స్పెషల్’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఆమె రాతలపై ఎన్ని వార్తలొచ్చాయో కానీ. ఆమె ధరించిన లెహంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు చర్చంతా దీనిపైనే.  బంగారం, వెండిలతో చేసిన ఈ లెహంగాను డిజైన్ చేశారు ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా. 

47
Kiara Advani is a huge troll

అంతే కాదు ఈ లెహంగాకు 98 వేలకు పైగా క్రిస్టల్స్ వినియోగించారట. దీని తయారీ కోసం 4 వేల గంటల సమయం పట్టిందట. అంటే 150 రోజుల పాటు  దీనిని రూపొందించారట మనీష్ మల్హోత్రా టీం. అయితే ఈ లెహంగా రేటు మాత్రం బయటకు చెప్పలేదు కాని.. ఇంత స్సెషల్ అయిన ఈ డ్రస్ మాత్రం  లక్షల్లో ధర ఉంటుందని సమాచారం.

57
Kiara Advani

ప్రస్తుతం ఈ డ్రస్ కుసబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటు కియారాతో పాటు అటు మనీష్ మల్హోత్రా కూడా ఈ డ్రస్ కు సబంధించిన అద్భుతాలనువివరిస్తూ.. పోస్ట్ పెట్టారు. దాంతో బాలీవుడ్ లో ఇప్పుడిది హాట్ టాపిక్ అయ్యింది.ఏది ఏమైన కియారా వెడ్డింగ్ డ్రెస్ తో పాటు.. సంగీత్ డ్సెస్ లో కూడా అదరగొట్టిందనే చెప్పాలి. 

67
Image: Kiara Advani / Instagram

చాలా కాలం సీక్రేట్ గా ప్రేమ కలాపాలు నడిపించిన బాలీవుడ్ క్యూట్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మలోత్రా ఈ నెల 7న పెళ్లితో ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్ల నుండి ప్రేమలో ఉన్న ఈ జంట అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, ప్రముఖులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో రాజస్థాన్ లోని జైసల్మేర్ లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. 

77

అతిథులు తక్కువమందినే పిలిచినా.. ఈ పెళ్లికి భారీగా ఖర్చు అయినట్లు సమాచారం. ఈ వేడుకలకు మీడియాను ఆహ్వానించలేదు. పెళ్లి తర్వాత ముంబయ్ లో సినీ తారల కోసం గ్రాండ్ గా రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు కొత్త జంట. ఇక  తాజాగా మెహందీ, సంగీత్, పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు స్టార్ కపుల్.
 

click me!

Recommended Stories