పెళ్లి చేసుకోపోతే బ్రతకలేమా...? సిద్దార్థ్ మల్హోత్రాతో పెళ్ళి వార్తలపై ఘాటుగా స్పందించిన కియారా అద్వాని

Published : May 23, 2022, 08:29 AM IST

బాలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌లో కూడా స్టార్ హీరయిన్ గా కొనసాగుతుంది కియారా అద్వాని.  చాలా కాలంగాసిద్ధార్థ్‌ మల్హోత్రాతో ప్రేమ పెళ్ళి వార్తలు గుప్పుమనటంతో.. రీసెంట్ గా ఈ విషయంపై స్పందించింది బ్యటీ. ఇంతకీ ఆమె ఏమన్నది. 

PREV
16
పెళ్లి చేసుకోపోతే బ్రతకలేమా...? సిద్దార్థ్ మల్హోత్రాతో పెళ్ళి వార్తలపై ఘాటుగా స్పందించిన కియారా అద్వాని

ఎట్టకేలకు పెళ్ళి వార్తలపై స్పందించింది కియారా అద్వాని. గత కొంత కాలంగా కియారా అద్వాని, సిద్ధార్థ్‌ మల్హోత్రా పెళ్ళి అంటూ కొందరు, లేదు వారు బ్రేకప్ చెప్పుకున్నారు అంటూ.. మరికొందరు.. ఇలా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఫ్యాన్స్ వీరి స్పందన కోసం ఎదురుచూస్తుండగా.. రీసెంట్ గా కియారా స్పందించింది. 

26

కియారా అద్వానీ బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్‌ మూవీ జుగ్ జుగ్‌ జియో. ఈ మూవీ ట్రైలర్‌ ఆదివారం రిలీజైంది. ఇందులో ఆమె వరుణ్‌ ధావన్‌ సరసన నటిస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో అనిల్‌ కపూర్‌, నీతూ కపూర్‌ కూడా కనిపించనున్నారు. ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా మూవీ క్యాస్ట్‌ ఎన్నో అంశాలపై స్పందించింది. కరణ్‌ జోహార్‌, వరుణ్ ధావన్‌లాంటి వాళ్లు సౌత్‌ సినిమాల సక్సెస్‌పై మాట్లాడగా.. కియారా తన పెళ్లి వార్తలపై రియాక్టైంది.

36

 బాలీవుడ్‌ యంగ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ఆమె చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారని ఇప్పటికే చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి. తాజాగా మూవీ ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా కూడా కియారా పెళ్లి గురించి మీడియా వాళ్లు అడిగారు. పెళ్లి చేసుకొని సెటిలయ్యే ప్లాన్స్‌పై ప్రశ్నించగా.. ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది.

46

పెళ్లి కాకుండా కూడా నేను బాగానే సెటిల్‌ కావచ్చు కదా? ఇప్పటికే నేను బాగా సెటిలయ్యాను. నేను పని చేస్తున్నాను. సంపాదిస్తున్నాను. సంతోషంగానే ఉన్నాను. ఇంకేంటి  అని కియారా అనడంతో అక్కడ ఉన్నవాళ్ళంతా షాక్ కు గురయ్యారు. 

56

భూల్‌ భులయ్యా 2 సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తోంది కియారా అద్వాని. చాలా రోజల తర్వాత బాలీవుడ్‌లో కాస్త మంచి కలెక్షన్లు రాబడుతున్న మూవీగా ఈ భూల్‌ భులయ్యా 2 నిలిచింది. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ సరసన కియారా నటించింది. ఇక ఆమె లేటెస్ట్‌ మూవీ జుగ్‌ జుగ్‌ జియో మూవీ వచ్చే నెల 24న రిలీజ్‌ కానుంది. 
 

66

ఈ  సినిమాలతో పాటు టాలీవుడ్ లో మరో సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో నటిస్తోంది కియారా అద్వాని. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్‌చరణ్‌ చేస్తోన్న  మూవీలో హీరోయిన్ గా ఆమె నటిస్తోంది. అంతే కాదు టాలీవుడ్ నుంచే మరికొంత మంది స్టార్స్ జోడీగా కియారాకు ఆఫర్లు వెళ్తున్నాయి. 

click me!

Recommended Stories