రాకింగ్ స్టార్ యశ్ 'టాక్సిక్' సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలోని కొన్ని సీన్స్ తీసేయాలని హీరోయిన్ కియారా అద్వానీ మేకర్స్‌ను కోరినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో సినిమాకు కొత్త చిక్కులు మొదలయ్యాయి.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా టాక్సిక్ (Toxic) గురించి రోజుకో కొత్త వార్త ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పదేపదే వాయిదా పడుతుండటంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ కియారా అద్వానీ పెట్టిన ఓ కండిషన్ మూవీ టీమ్ ను మరింత టెన్షన్ లో పడేసింది.
25
రిలీజ్ డేట్ పై గందరగోళం
యష్ మొదటిసారి నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ పాన్ ఇండియా హీరో నటిస్తున్న టాక్సిక్ తో పాటు రామాయణ్ సినిమాల కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట టాక్సిక్ సినిమాను మార్చి 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయాలనుకున్నారు.
కానీ అదే రోజు 'ధురందర్ 2' కూడా రిలీజ్ అవుతుండటంతో, బాక్సాఫీస్ క్లాష్ వద్దనుకుని డేట్ మార్చారు. ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధ వాతావరణం, టెక్నికల్ కారణాలతో జూన్ 4కి వాయిదా వేశారు. కానీ ఇప్పుడు జూన్ 4న కూడా సినిమా రావడం లేదని, రిలీజ్ డేట్‌ను మళ్లీ పోస్ట్‌పోన్ చేసినట్లు సమాచారం.
35
కియారా అద్వానీ కొత్త డిమాండ్
ఈ భారీ బడ్జెట్ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా లాంటి పెద్ద హీరోయిన్లు నటిస్తున్నారు. యశ్‌కు జోడీగా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరిపై తీసిన ఓ పాట రిలీజై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కియారా తన షూటింగ్ పార్ట్‌ను చాలా రోజుల క్రితమే పూర్తి చేసింది. అయితే, ఈ మధ్య సినిమాలోని కొన్ని ఇంటిమేట్ సీన్స్, టీజర్‌లోని కొన్ని షాట్స్ సోషల్ మీడియాలో వివాదానికి దారితీశాయి.
రిపోర్టుల ప్రకారం, షూటింగ్ టైంలో డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ చెప్పినట్లే కియారా ఈ బోల్డ్ సీన్స్‌లో నటించడానికి ఒప్పుకున్నారట. కానీ ఎడిటింగ్ తర్వాత ఆ సీన్స్ చూసుకుని కియారా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారని టాక్. అందుకే, ఆ సీన్స్ నిడివిని తగ్గించాలని లేదా పూర్తిగా సినిమా నుంచి తీసేయాలని ఆమె టీమ్‌ను రిక్వెస్ట్ చేశారట. ఆ సీన్స్ అలాగే ఉంటే తన ఫ్యామిలీ ఇమేజ్‌కు డ్యామేజ్ అవుతుందని ఆమె ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
55
భారీ రెమ్యూనరేషన్..
కియారా అద్వానీ ఈ సినిమా కోసం ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యధికం. ఇప్పుడు కియారా రిక్వెస్ట్‌తో సినిమా ఫైనల్ ఎడిటింగ్‌లో డైరెక్టర్ పెద్ద మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యష్ కెరీర్ లో 'టాక్సిక్' చాలా ముఖ్యమైన సినిమా. హీరోయిన్ పెట్టిన ఈ కొత్త కండిషన్‌ను టీమ్ ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఈ మార్పుల వల్ల సినిమా రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.