మహేష్ బాబు అభిమానులను టెన్షన్ పెట్టిన సినిమా ఏదో తెలుసా? ఎన్టీఆర్ తప్పించుకుని మహేష్ ను బుక్ చేశాడుగా?

Published : May 03, 2026, 08:27 AM IST

మహేష్ బాబు కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు చేశారు. డిజాస్టర్ మూవీస్ ను కూడా చేశాడు. కానీ కెరీర మొత్తం మీద ఆయన అభిమానులను భయపెట్టిన సినిమా మాత్రం ఒక్కటే ఉంది. అదేంటో తెలుసా?

PREV
15
ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే..

సూపర్ స్టార్ కృష్ణకు ఏడాదికి 15 సినిమాలు చేసిన రికార్డు ఉంటే.. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు మాత్రం.. ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తాడు. ఒక్క సినిమాతోనే అభిమానులకు ఫుల్ మీల్స్ ప్లాన్ చేస్తాడు సూపర్ స్టార్ . అది మిస్ అయ్యిందంటే, మళ్లీ మహేష్ నుంచి సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు అభిమానులు. 

మహేష్ కెరీర్ లో ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయో.. అన్ని ప్లాప్ లు కూడా ఉన్నాయి. డిజాస్టర్ల సంఖ్య కూడా ఎక్కువే. కానీ ఆయన సినిమాల్లో అభిమానులను చిరాకు పెట్టి.. భయపెట్టిన సినిమా మాత్రం ఒక్కటే ఉంది అదే బ్రహ్మోత్సవం.

25
నమ్మి సినిమా ఇస్తే..

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత.. శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సినిమా బ్రహ్మోత్సవం. మంచి ఫ్యామిలీ ఎంటర్టైననర్ ను ఇచ్చిన శ్రీకాంత్ ను నమ్మి, మహేష్ బాబు మళ్లీ అవకాశం ఇచ్చాడు. మళ్లీ అదే ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ తో బ్రహ్మోత్సవం సినిమాను తెరకెక్కించాడు శ్రీకాంత్ అడ్డాల. 

అయితే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోనే కొన్ని సీన్లు ఓవర్ ఎమోషనల్ గా ఉన్నాయి అంటే.. బ్రహ్మోత్సవం సినిమా అంతా అలాంటి సన్నివేశాతోనే నింపేశాడు దర్శకుడు. నాసిరకం కథ, దానికి తోడు స్క్రీన్ ప్లే కూడా పొంతన లేకుండా ఉండటంతో మూవీ డిజాస్టర్ అయ్యింది.

35
అభిమానులకే చిరాకు వచ్చింది..

బ్రహ్మోత్సవం సినిమా చూసిన అభిమానులకే చిరాకు వచ్చింది. సూపర్ స్టార్ నుంచి మంచి సినిమా ఎక్స్ పెక్ట్ చేసినవారికి తీవ్ర నిరాశ తప్పలేద. మహేష్ బాబుకు ఇది సరైన సినిమా కాదు అని అభిప్రాయం ఆడియన్స్  నుంచి వచ్చింది. చెత్త సినిమాను ఎలా ఒప్పుకున్నాడంటూ సూపర్ స్టార్ పై కూడా అభిమానులు కోపగించుకున్న సందర్బాలు ఉన్నాయి. 

దాంతో మహేష్ బాబు ఆ సినిమా తరువాత నుంచి చాలా జాగ్రత్తగా సినిమాలను సెలక్ట్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఎన్ని కథలు వచ్చినా  అందులో అభిమానులకు కావలసిన అంశాలు ఉంటేనే.. ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవాడు. ఈ విషయంలో నమ్రత కూడా మహేష్ కు సపోర్ట్ గా నిలవడంతో.. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టాడు మహేష్.

45
ఎన్టీఆర్ మిస్ అయ్యాడు.. మహేష్ బాబు బుక్ అయ్యాడు..

నిజానికి బ్రహ్మోత్సవం సినిమా కథ ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగరికి వెళ్ళింది. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన బ్రహ్మోత్సవం స్టోరీ లైన్ తారక్ కు బాగా నచ్చింది. కానీ అందులో కొన్ని మార్పులను ఆయన సూచించారు. దాంతో శ్రీకాంత్ అడ్డాల ఎన్టీఆర్ చెప్పిన మార్పులు చేసి మళ్ళీ వినిపించాడట. కానీ ఎన్టీఆర్ కు ఈ కథలో.. ఎక్కడో చిన్న అసంతృప్తి ఉంది. 

అసలే ఎన్టీఆర్ అప్పుడు వరుస ప్లాప్ లతో ఇబ్బందుల్లో ఉన్నాడు., అదే టైమ్ లో ఈ సినిమా ఒప్పుకుని రిస్క్ చేయడం ఎందుకు అనుకున్నాడు తారక్. సున్నితంగా ఈ సినిమాకు నో చెప్పాడట. అలా ఎన్టీఆర్ నో చెప్పిన బ్రహ్మోత్సవం సినిమా మహేష్ బాబు ఓకే చేశారు.

55
వారణాసి బిజీలో మహేష్ బాబు..

ప్రస్తుతం మహేష్ బాబు తన 29వ సినిమాగా వారణాసి చేస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కుతోంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొదటి సారి.. దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈసినిమా రూపొందుతోంది. ఈసినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి మహేష్ బాబు ఎంటర్ అవ్వబోతున్నాడు.

 50 ఏళ్ల వయసులో కూడా సూపర్ స్టార్ కుర్ర హీరోలా మెరిసిపోతున్నాడు. హాలీవుడ్ లుక్ తో అదరగొడుతున్నాడు. ఈసినిమాతో ఆయన ఇమేజ్ ఏరేంజ్ కి వెళ్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో మలయాళ స్టార్ ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories