మోనాలిసా కేసు ఇప్పట్లో తేలేట్లు లేదు. ఓవర్ నైట్ స్టార్ గా మారి వార్తల్లో కెక్కిన ఈ అమ్మాయి.. పెళ్లి చేసుకుని మరోసారి వైరల్ అయ్యింది. తాజాగా డైరెక్టర్ పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనంగా మారింది.
కుంభమేళాలో పూసలమ్ముకున్న అమ్మాయి.. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. బాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస అవకాశాలు సాధించింది. స్టార్ హీరోలకు పోటీ ఇస్తుందని అంతా అనుకున్న టైమ్ లో.. సడెన్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది మోనాలిసా. తాజాగా ఆమె బాలీవుడ్ దర్శకుడు సహా నలుగురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ.. పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
24
నలుగురిపై కేసు నమోదు..
మోనాలిసా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేరళలోని ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో బాలీవుడ్ దర్శకుడు సనోజ్ మిశ్రా, అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకుడు , న్యాయవాది అనిల్ విలయిల్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం.
34
10 సార్లు లైంగికంగా వేధించాడు..
మోనాలిసా తన కంప్లైంట్ లో చెప్పిన వివరాల ప్రకారం, ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. కొచ్చిలో జరిగిన ఒక ఈవెంట్ లో దర్శకుడు సనోజ్ మిశ్రా తనను చాలా సార్లు అసభ్యంగా తాకాడని మోనాలిసా ఆరోపించింది. “షూటింగ్ సెట్‌లో దాదాపు 10 సార్లు నన్ను లైంగికంగా వేధించాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పినా వారు పట్టించుకోలేదు” అని ఆమె తన వాంగ్మూలంలో తెలిపింది. పీటీఐ రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 29న ఈ ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. ఏప్రిల్ 30న ఆమె కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చింది.
ఈ ఘటనలు మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్నందున, కేసును అక్కడి పోలీసులకు బదిలీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల మోనాలిసా తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కూడా వివాదానికి దారితీసింది. ఆమె మైనర్ అని, ఈ వివాహం ‘లవ్ జిహాద్’కు సంబంధించినదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే మోనాలిసా మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది.ఇప్పటికే కుటుంబ వివాదాలు కొనసాగుతున్న సమయంలో, ఈ లైంగిక వేధింపుల ఆరోపణలతో మోనాలిసా పరిస్థితి మరింత ఇబ్బందుల్లో పడింది.