ఇప్పుడిప్పుడే ఖుషి కపూర్ కి హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. ఖుషి కపూర్ ఈ ఏడాది నటించిన చిత్రం లవ్ యాపా. ప్రదీప్ రంగనాథన్ సూపర్ హిట్ మూవీ లవ్ టుడే చిత్రానికి బాలీవుడ్ లో రీమేక్ గా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఖుషి కపూర్, అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ జంటగా నటించారు. జునైద్ ఖాన్, ఖుషి కపూర్ రెచ్చిపోయి ఈ చిత్రంలో రొమాన్స్ పండించారు.