
Pradeep Machiraju: తెలుగులో రియాలిటీ షోస్ ఆడియెన్స్ ని అలరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చాలా టీవీ షోస్ ఎంటర్‌టైన్‌మెంట్ ని పంచుతూ సీరియల్స్ ని కూడా డామినేట్ చేస్తున్నాయి. జబర్దస్త్ కామెడీ షోగానీ, ఢీ షోగానీ, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆదివారం స్టార్ మా పరివారం, ఇస్మార్ట్ జోడీ, సరిగమప, ఫ్యామిలీ స్టార్స్, కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ వంటి షోస్ ఎంతగా పాపులర్ అయ్యాయో తెలిసిందే.
అయితే వీటిలో కొన్నిసార్లు గొడవలు అవుతాయి. అటు కంటెస్టెంట్ల మధ్య, ఇటు కంటెంస్టెంట్లు, జడ్జ్ ల మధ్య గొడవలు జరుగుతుంటాయి. షో నుంచి కొందరు వెళ్లిపోతారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. కాసేపు అది పెద్ద రచ్చ అవుతుంది.
మరి ఇలాంటి గొడవల్లో ఎంత నిజం ఉంది?, రియాలిటీ షోస్‌లో గొడవలు నిజమేనా? లేదా అంతా ఒక డ్రామానా? అనేది బయటపెట్టాడు యాంకర్ ప్రదీప్. ఆయన కూడా చాలా షోస్‌కి యాంకర్‌గా వ్యవహరించారు. `ఢీ` ఆయనకు మంచి పేరుని తీసుకొచ్చింది.
అయితే ఇప్పుడు యాంకరింగ్ పక్కన పెట్టి హీరోగా మారారు. ప్రస్తుతం ఆయన `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` అనే సినిమాలో హీరోగా నటించారు. త్వరలో ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ప్రదీప్.
ఈ క్రమంలో ప్రదీప్ మాచిరాజుకి రియాలిటీ షోస్ గురించి ప్రశ్న ఎదురైంది. మిర్చి9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై ఓపెన్ అయ్యారు. అసలు బండారం బయటపెట్టారు. రియాలిటీ షోస్‌లో రియాలిటీ టైటిల్‌లోనే ఉంటుందన్నారు. ఒక్కో షోకి ఒక్కో ఫార్మాట్ ఉంటుందని, ఒక్కొక్కల్లది ఒక్కో రకమైన మేకింగ్ అని, ఇలా చేస్తే జనం చూస్తారని, రేటింగ్ వస్తుందని నమ్ముతారు.
రియాలిటీ షోస్‌లో వారం వారం ఎనర్జీలు మారిపోతాయి. ఇంకొంచెం డోస్ పెంచాల్సి వస్తుంది, డ్రామా పెంచుతారు. అందంతా షోలో భాగమే. ఏదో కాంట్రవర్సీ చేద్దాం, బ్యాంగ్‌లు వేద్దామనేది అయితే ఉండదు. షోని ఎవరైతే సీరియస్‌గా తీసుకుంటారో, వాళ్లు నిజంగానే కొట్లాడతారు.
అయితే రియాలిటీ షోస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మార్కెట్ డిమాండ్‌ని బట్టి అలా క్రియేట్ చేస్తుంటారు. గొడవలు పెట్టుకుని వెళ్లిపోవడం పెద్ద డ్రామా అని తెలిపారు ప్రదీప్. రియాలిటీ షోస్ టెలివిజన్ రంగంలో ఒక ఎరా అని,
ఎంటర్‌టైన్‌మెంట్ స్టయిల్‌నే మార్చేశాయని, చూసే ఆడియెన్స్ ని పెంచాయని, రేటింగ్‌ని పెంచాయని తెలిపారు. మహిళల్నే కాదు, యంగ్‌స్టర్స్, ఇతర రంగాలకు చెందిన వారిని కూడా టీవీ వైపు తిప్పాయన్నారు ప్రదీప్.
మరోవైపు గేమ్ షోస్ లో డబ్బులు గెలుచుకున్నప్పుడు అవి కేవలం కామన్ పీపుల్స్ కే డబ్బులు ఇస్తారు, సెలబ్రిటీలకు డబ్బులు ఉండవని, ముందుగానే ఒక అండర్ స్టాండింగ్ ఉంటుందని, అది కూడా బడ్జెట్‌ని బట్టి తక్కువ స్థాయిలోనే ఉంటుందన్నారు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. పెద్ద నెంబర్స్ ఎవరికీ ఇవ్వరని చెప్పారు.
అలాగే, టీవీ షోస్‌లో ఫోన్ కాల్స్ కూడా నిజమే అని తెలిపారు. కానీ గొడవల విషయంలో మాత్రం అంతా అంబక్ అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ విషయంలో టీవీ షో రేటింగ్ కోసం ఆడియెన్స్ ని ఫూల్‌ని చేయడమే అని చెప్పకనే చెప్పారు ప్రదీప్.
ఇక ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` మూవీకి నితిన్, భరత్ దర్శకులు. మంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 11న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ మూవీ రిజల్ట్ ప్రదీప్ కెరీర్‌ని నిర్ణయించబోతుంది.
read more: `వకీల్ సాబ్` హీరోయిన్ బాలీవుడ్ ఎంట్రీ.. ఆ సినిమాలకి బెస్ట్ ఛాయిస్.. ఏం చేస్తుందంటే?
also read: సినిమాల్లేకపోయినా కోట్లు సంపాదిస్తున్న ప్రశాంత్.. ఏంచేస్తున్నాడో తెలిస్తే మతిపోవాల్సిందే