Venkatesh, Nagarjuna: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్.. కానీ చదువుకున్నది మాత్రం 9th క్లాస్ మాత్రమే. కానీ ఇంగ్లీష్ మాత్రం అద్భుతంగా మాట్లాడుతుంది. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, నాగార్జున దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా?
సాధారణంగా హీరోయిన్లు అంటేనే ఇంగ్లీష్‌లో అదరగొడుతుంటారు. మాతృభాష వచ్చినా కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడటం కొంతమందికి అలవాటు. ఉన్నత చదువులు చదువుకుంటూనే హీరోయిన్లుగా మారినవారు చాలామంది ఉన్నారు. కానీ ఓ నటి మాత్రం 9th క్లాస్‌ను మధ్యలోనే వదిలేసి హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ తార.. స్టార్ హీరోల సరసన మెరిసింది. తక్కువ చదువుకున్నా ఇంగ్లీష్ మాత్రం అనర్గళంగా మాట్లాడుతుంది. దానికి కారణం వెంకటేష్, నాగార్జున అని చెబుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
24
నాగార్జున, వెంకటేష్‌లకు కృతజ్ఞతలు
సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన నటీమణుల్లో ఖుష్బూ ఒకరు. బహుభాషా నటిగా, స్పష్టమైన ఉచ్చారణతో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే ఆమె ప్రతిభను చూసి చాలామంది ఫారెన్ లో చదువుకుని వచ్చిందేమో అని అనుకుంటారు. ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను 9వ తరగతిలోనే చదువును నిలిపివేశానని (discontinue) ఖుష్బూ వెల్లడించారు. పాఠశాల చదువు పూర్తికాకపోయినా అంతటి చక్కని ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారనే ప్రశ్నకు ఖుష్బూ స్పందిస్తూ, తన భాషా నైపుణ్యానికి ప్రధాన కారణం టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున అని తెలిపారు.
34
ఖుష్బూను ప్రోత్సహించిన హీరోలు..
తమిళంలో హీరోయిన్‌గా పరిచయమైన ఖుష్బూ.. తెలుగులో చేసిన మొదటి సినిమా వెంకటేష్‌తో, రెండవ సినిమా నాగార్జునతో జరిగింది. ఆ సమయంలో వెంకటేష్, నాగార్జున ఇద్దరూ అమెరికాలో చదువు ముగించుకుని భారతదేశానికి తిరిగివచ్చారు. అప్పట్లో ఖుష్బూ ఇంగ్లీష్ అంతగా బాగుండేది కాదట, కానీ వారిద్దరూ ఖుష్బూను నిరంతరం ఇంగ్లీష్‌లోనే మాట్లాడమని ప్రోత్సహించేవారట. షూటింగ్ గ్యాప్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడటం, తప్పులను సరిదిద్దడం లాంటివి చేసేవారట.
ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడంలో పుస్తకాలు చదవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని నాగార్జున ఖుష్బూకు వివరించారు. ఆయన తనకు మొదటి ఇంగ్లీష్ నవలను బహుమతిగా ఇచ్చి, ఇంగ్లీష్ నవలలు చదవడం ప్రారంభించాలని సూచించారు. నాగార్జున ఇచ్చిన ఆ బహుమతే తనలో ఇంగ్లీష్‌పై ఇష్టాన్ని, నేర్చుకోవాలన్న తపనను పెంచిందని ఖుష్బూ గుర్తుచేసుకున్నారు. వెంకటేష్ మాటల్లో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు వస్తుంటాయి.. వాటిని అనుసరించి తాను కూడా మాట్లాడటానికి ప్రయత్నించానని ఖుష్బూ అన్నారు.