Rashmi Gautam: ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన యాంకర్ రష్మీ గౌతమ్, నన్ను ఏమైనా అనండి కానీ...

Published : Sep 28, 2026, 07:19 AM IST

Rashmi Gautam: టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ ట్రోలర్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. మూగజీవాల కష్టాలు, జంతు సంరక్షణ, అధికారుల బాధ్యతలపై ఆమె అడిగిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

PREV
15
యాంకర్‌గా అదరగొడుతున్న రష్మీ

టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై యాంకర్‌గా అదరగొడుతున్న రష్మీ, కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే ఆమె కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితం కాలేదు. సామాజిక సమస్యలపైనా తనదైన స్టైల్‌లో గళం విప్పుతుంటుంది. ముఖ్యంగా మూగజీవాల కోసం రష్మీ చాలాసార్లు ముందుకొచ్చి మాట్లాడింది.

మంచి పనులు చేసేవాళ్లను విమర్శించేవాళ్లు ఎప్పుడూ ఉంటారు కదా. అలాగే రష్మీ కూడా సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. కానీ అలాంటి ట్రోల్స్‌కు ఆమె తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇస్తుంటుంది. తాజాగా రష్మీ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

25
మూగజీవాల విషయంలో

'నన్ను ఏమైనా అనండి, కానీ మూగజీవాల విషయంలో అధికారులను నిలదీయకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది' అనే ఉద్దేశంతో రష్మీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

35
నన్ను అవమానించండి.. నాకేం పట్టింపు లేదు

రష్మీ తన పోస్ట్‌లో.. 'నన్ను అవమానించండి.. నన్ను తక్కువ చేసి చూడండి.. నన్ను తిట్టండి.. నేను దేన్నీ పట్టించుకోను' అని చెప్పింది. కానీ అదే సమయంలో ప్రజలు అధికారులను ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేసింది.

'మీరు అధికారులను ప్రశ్నించడం మొదలుపెట్టకపోతే ఆ ఫండ్స్ ఎక్కడికి పోతున్నాయి? జంతు సంరక్షణ కేంద్రాలు ఎందుకంత దారుణమైన స్థితిలో ఉన్నాయి? ప్రభుత్వ పశువైద్యశాలల్లో సరైన సదుపాయాలు ఎందుకు లేవు?' అని ఆమె నిలదీసింది.

45
స్ట్రాంగ్ వార్నింగ్..

అంతేకాదు, వీధి కుక్కలు, పిల్లులకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, వ్యాక్సిన్లు ఎందుకు వేయడం లేదని కూడా రష్మీ ప్రశ్నించింది. ఆవులు, గేదెలను పెంచే యజమానులకు సరైన గైడెన్స్ ఎందుకు ఇవ్వడం లేదనే విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించింది.

55
రాబోయే తరాలకు పచ్చదనం మిగులుతుందా?'

అడవి జంతువులు పదే పదే జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి? రాబోయే తరాలు చూసేందుకు కనీసం కొంచెమైనా పచ్చదనం మిగులుతుందా? లాంటి ఎన్నో ప్రశ్నలను రష్మీ తన పోస్ట్‌లో లేవనెత్తింది. చివరగా ట్రోలర్స్‌కు కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. 'నన్ను విమర్శించడం వల్ల మీకు ఎలాంటి లాభం లేదు. కాబట్టి మీ సమయాన్ని, ఎనర్జీని తెలివిగా వాడుకోండి' అని మెసేజ్ ఇచ్చింది.

మూగజీవాల సమస్యలపై ప్రజలు, అధికారులు దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో రష్మీ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. కొందరు ఆమె మాటలకు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు నెటిజన్లు ఆమె కామెంట్స్‌పై తమ సొంత అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories