KGF నటుడికి రోడ్డు ప్రమాదం.. ధ్వంసమైన కారు, రెడ్ సిగ్నల్ జంప్ చేసి దూసుకొచ్చిన కంటైనర్..

Published : Jul 01, 2022, 11:32 AM IST

చిత్ర పరిశ్రమలో తరచుగా జరిగే రోడ్డు ప్రమాదాలు అభిమానులకు షాకింగ్ గా మారుతున్నాయి. తాజాగా కెజిఎఫ్ నటుడు బిఎస్ అవినాష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 

PREV
16
KGF నటుడికి రోడ్డు ప్రమాదం.. ధ్వంసమైన కారు, రెడ్ సిగ్నల్ జంప్ చేసి దూసుకొచ్చిన కంటైనర్..

ప్రమాదాల్ని ఎవరూ ఊహించలేరు. రోజూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ భాద్యతగా వ్యవహరించాలి. చిత్ర పరిశ్రమలో తరచుగా జరిగే రోడ్డు ప్రమాదాలు అభిమానులకు షాకింగ్ గా మారుతున్నాయి. తాజాగా కెజిఎఫ్ నటుడు బిఎస్ అవినాష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 

 

26

అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అతడికి ఎలాంటి గాయాలు కాలేదు. పెద్ద ప్రమాదం నుంచి సేఫ్ అయ్యాడనే చెప్పాలి. జరిగింది మాత్రం చిన్న యాక్సిడెంట్ కాదు. ఏకంగా ఒక కంటైనర్ అతడి కారుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అవినాష్ కారు కొంత భాగం ధ్వంసం అయింది. 

 

36

బిఎస్ అవినాష్ కెజిఎఫ్ 1, కెజిఎఫ్ 2లో ఆండ్రూ పాత్రలో నటించాడు. గుబురు గడ్డంతో కనిపించి మెప్పించాడు. కెజిఎఫ్  చిత్రంలో అతడిది ప్రాధాన్యత ఉన్న పాత్రే. ప్రమాదానికి సంబంధించిన వివరాలని అవినాష్ సోషల్ మీడియాలో ఎమోషనల్ గా తెలిపాడు. 

 

46

నిన్న ఉదయం 6 గంటలకు నేను జీవితకాలానికి సరిపడా భయం చూశాను. బెంగుళూరులో ఈ ప్రమాదం జరిగింది. ఇంటి నుంచి జిమ్ కి వెళుతుండగా అనిల్ కుంబ్లే సర్కిల్ వద్ద ప్రయాణిస్తుండగా ఓ కంటైనర్ రెడ్ సిగ్నల్ జంప్ చేసి మారి నా కారుని ఢీ కొట్టింది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. 

 

56

మీ ప్రేమ, దేవుడి దయతో అద్భుతం జరిగింది. కారు ధ్వంసం అయినప్పటికీ నాకు ఎలాంటి గాయాలు కాలేదు. సేఫ్ గా బయట పడ్డాను. కంటైనర్ డ్రైవర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అవినాష్ తేలిపోయారు. ఇలాంటి సమయంలో నాకు అండగా నిలబడిన అభిమానులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి కృతజ్ఞతలు' అని అవినాష్ పోస్ట్ పెట్టారు. 

 

66

మీరు సేఫ్ గా బయట పడ్డందుకు సంతోషంగా ఉంది.. థాంక్ గాడ్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఆండ్రు యాత్రలో కెజిఎఫ్ లో అవినాష్ పవర్ ఫుల్ గా కనిపించాడు. ఈ ఏజ్ లో కూడానా అతడి ఫిట్ నెస్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

 

click me!

Recommended Stories