ఫేస్ బుక్ లో పవిత్ర లోకేష్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా ఆకతాయిలు కొందరు పోస్ట్ లు పెడుతున్నారు. దీనిపై పవిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసభ్యంగా పోస్ట్ లు పెడుతూ, అసత్యాలు ప్రచారం చేస్తూ తనకి పరువు నష్టం కలిగిస్తున్నారని, మానసిక ప్రశాంతత దూరం చేస్తున్నారు అంటూ పవిత్ర ఫిర్యాదులో పేర్కొన్నారట.