KGF2 Collections: బాలీవుడ్‌లో `కేజీఎఫ్‌ 2` సునామీ.. రెండు రోజుల్లో సరికొత్త రికార్డ్.. వరల్డ్ వైడ్‌గా ఎంతంటే?

Published : Apr 16, 2022, 04:54 PM ISTUpdated : Apr 16, 2022, 05:15 PM IST

ఇండియన్‌ సినిమాలో మరో సునామీలా మారింది `కేజీఎఫ్‌2` సినిమా. ఈ చిత్రం బాక్సాఫీసు వేట స్టార్ట్ చేసింది. కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తుంది. బాలీవుడ్‌లో మోత మోగిస్తూ, వరల్డ్ వైడ్‌గా దండయాత్ర చేస్తుంది. 

PREV
16
KGF2 Collections: బాలీవుడ్‌లో `కేజీఎఫ్‌ 2` సునామీ.. రెండు రోజుల్లో సరికొత్త రికార్డ్.. వరల్డ్ వైడ్‌గా ఎంతంటే?

కన్నడ చిత్ర పరిశ్రమకి జాతీయ స్థాయి గుర్తింపుని, పాపులారిటీని, క్రేజ్‌ని తీసుకొచ్చిన చిత్రం `కేజీఎఫ్‌(కోలార్‌ గోల్డ్ ఫీల్డ్‌)(KGF2 Movie). నాలుగేండ్ల క్రితం విడుదలైన తొలి భాగం(కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 1` భారీ విజయాన్ని సాధించింది. దానికి రెండో పార్ట్ గా, భారీ అంచనాలతో వచ్చింది `కేజీఎఫ్‌ 2`. యష్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో సంజయ్‌ దత్‌, రవీనా టండన్‌, ప్రకాష్‌రాజ్‌, రావు రమేష్‌ కీలక పాత్రలు పోషించిన రెండో పార్ట్ గురువారం(ఏప్రిల్‌ 14)న విడుదలైంది. బాక్సాఫీస్‌పై కలెక్షన్ల దండయాత్ర చేస్తుంది. 
 

26

ఈ చిత్రం రెండు రోజుల్లో ఇండియా వైడ్‌గా ఏకంగా రూ.240కోట్లు వసూలు చేయడం విశేషం. కేవలం ఇండియాలోనే ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం విశేషమంటున్నారు ట్రేడ్‌ వర్గాలు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో రూ.290కోట్లు కలెక్ట్ చేసిందని తెలుస్తుంది. మొదటి రోజు సుమారు రూ.150కోట్లు వసూలు చేసింది. రెండో రోజు సుమారు రూ.140కోట్లు వసూలు చేసిందని సమాచారం. KGF2 Collections.

36

అయితే `కేజీఎఫ్‌ 2` కేవలం రెండు రోజుల్లో హిందీలోనే వంద కోట్ల కలెక్షన్లని రాబట్టడం మరో విశేషం. దీంతో ఇది సరికొత్త రికార్డ్ ని క్రియేట్‌ చేసిందని చెప్పొచ్చు. తాజాగా బాలీవుడ్‌ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ వెల్లడించారు. రెండు రోజుల్లో హిందీ `కేజీఎఫ్‌ 2` రూ100.74కోట్లు వసూలు చేసింది. ఇది `బాహుబలి`, `దంగల్‌` చిత్రాలకంటే అత్యధికం కావడం విశేషమంటున్నారు. ఈ వారంలో ఈ సినిమా సుమారు 185కోట్లకుపైగా కలెక్షన్లని కేవలం హిందీలోనే రాబట్టే ఛాన్స్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. KGF2 @days Collections.

46

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కలెక్షన్లని రాబట్టుకుంటుంది. రెండో రోజుల్లో ఇక్కడ రూ.52కోట్లు వసూలు చేసింది. దాదాపు కర్నాటకకి సమానంగా తెలుగులో కలెక్షన్లు వస్తుండటం విశేషం. తమిళనాడు, హిందీలో కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్నాయి. విజయ్‌ సినిమా `బీస్ట్` కారణంగా తమిళనాట `కేజీఎఫ్‌2`కి కలెక్షన్లు తగ్గాయని సమాచారం. మొత్తంగా `కేజీఎఫ్‌2` సినిమా మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లని రాబట్టబోతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

56

ఈ సినిమా `ఆర్‌ఆర్‌ఆర్‌`ని మించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి బలమైన కలెక్షన్లు లేవు. ఆర్‌ఆర్‌ఆర్‌కి ఓవర్సీస్‌లోనే రూ.రెండువందల కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. కానీ `కేజీఎఫ్‌` ఆ విషయం వెనబడుతుంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం దుమ్మురేపుతుంది. ఈ వీకెండ్‌ వరకు ఢోకా లేదని, ఆ తర్వాత సినిమా డ్రాప్‌ ఎలా ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది. వీక్‌ డేస్‌లో వచ్చే కలెక్షన్లని బట్టి ఈ సినిమా రేంజ్‌ని నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. 
 

66

ఇదిలా ఉంటే `కేజీఎఫ్‌` సినిమాలో బలమైన కథ ఉంది. అదే దీనికి బిగ్గెస్ట్ స్ట్రెన్త్‌. అయితే ఆ కథని భారీ ఎలివేషన్లకి వాడుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ద్వితీయార్థంలో కేవలం ఎలివేషన్లకే ప్రయారిటీ ఇచ్చాడనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కథ పక్కకు వెళ్లిందని ఆడియెన్స్ నుంచి వినిపిస్తున్న మాట. అవసరం లేని చోట హీరో చేసే హంగామా ఓవర్‌గా ఉంటుందని అంటున్నారు. పైగా ఫోటోగ్రఫీ విషయంలో శృతిమించిన బ్లాక్‌ ఫ్రేమ్స్ వాడరనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories